మిగిలిపోయిన అన్నం, కూరలు,చపాతీలను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Aug 30, 2024, 10:23 AM IST

మిగిలిపోయిన ఆహారం తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, పోషకాహార లోపం, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆయుర్వేదం ప్రకారం వండిన ఆహారాన్ని 3 గంటల తర్వాత తినకూడదు.


చాలా సార్లు వండిన ఆహారం అందరూ తిన్న తర్వాత కూడా బాగా మిగిలిపోతుంటుంది. ఇంకేముందు చాలా మంది ఫుడ్ ను వేస్ట్ చేయకూడదని మిగిలిపోయిన ఆహారాలను మరుసటి రోజు వేడి చేసుకునో లేకపోతే అలాగే తింటుంటారు. ఫుడ్ ను వేస్ట్ చేయకూడదన్న ఆలోచన మంచిదే కావొచ్చు. కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని మాత్రం ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. అవును.. మిగిలిపోయిన అన్నం, కూరలు, చపాతీలు ఇలా ఏది తిన్నా మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే దీనిలో చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆయుర్వేదం కూడా మిగిలిపోయిన ఆహారం ఎన్నో రోగాలకు దారితీస్తుంది కాబట్టి దీన్ని తినకపోవడమే మంచిదని చెబుతోంది. 
 


అయితే సైన్స్ ప్రకారం.. మిగిలిపోయిన ఫుడ్ ను తినాలనుకుంటే.. దాన్ని 165 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద 15 సెకన్ల పాటు వేడి చేయాలి. దీనివల్ల ఆ ఫుడ్ లో ఉండే బ్యాక్టీరియా, వ్యాధికారకాలు చనిపోతాయి. సైన్స్ ప్రకారం.. మిగిలిపోయిన ఫుడ్ ను తిరిగి సరిగ్గా వేడి చేయడం వల్ల దానిలోని హానికారక బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా.. ఫుడ్ కూడా ఫ్రెష్ గా అవుతుంది. అయితే ఆయుర్వేదం ప్రకారం..  వండిన ఆహారాన్ని 3 గంటల తర్వాత తినకూడదు. ఎందుకంటే దీనిలో పోషకాలన్నీ నశిస్తాయని నమ్ముతారు. ఆయుర్వేదం ప్రకారం.. వండిన ఆహారాన్ని 3 గంటల్లోపు తినేయాలి. 
 


ఒకవేళ మీరు మిగిలిపోయిన ఆహారాన్ని ఖచ్చితంగా తింటుంటే మాత్రం 24 గంటలకు పైగా నిల్వ ఉన్న ఫుడ్ ను మాత్రం తినకుండా ఉండండి. అలాగే దీన్ని సరిగ్గా వేడి చేయాలి. అప్పుడే దాంట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. మీకు తెలుసా? మిగిలిపోయిన ఫుడ్ ను తింటే శరీరంలో దోషాలు పెరుగుతాయి. గట్ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అసలు మిగిలిపోయిన ఫుడ్ ను తింటే మనకు ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Constipation

జీర్ణక్రియ సమస్యలు: మిగిలిపోయిన ఫుడ్ ను తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ ఫుడ్ లో చెడు బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. దీన్ని తిన్న మనకు జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే అపానవాయువు, ఎసిడిటీ, వాంతులు, ఇన్ఫెక్షన్, మలబద్ధకం వంటి సమస్యలు కూడా వస్తాయి.

పేగు పనిచేయకపోవడం: పాడైపోయిన ఆహారాన్ని తింటే పేగుల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఈ ఫుడ్ మీ పేగుల పనితీరును ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కడుపులో పురుగులయ్యే అవకాశం కూడా ఉంది. అలాగు వాపు సమస్య కూడా ఉంటుంది. 
 

పోషకాహార లోపం: మీకు తెలుసా? మిగిలిపోయిన ఆహారాలను తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ ఆహారంలో పోషకాలు చాలా వరకు నశిస్తాయి. ఇలాంటి ఫుడ్ ను మీరు రోజూ గనుక తిన్నట్టైతే మీ శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. దీంతో మీరు చాలా బలహీనంగా మారిపోతారు. 

loose motion

లూజ్ మోషన్:  మీరు ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాలనే తిన్నట్టైతే మీకు విరేచనాల సమస్య ఎక్కువగా వస్తుంది. ఇది మీ శక్తిని తగ్గించి, మరింత బలహీనంగా మార్చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా తాజా, వేడివేడి ఆహారాన్ని మాత్రమే తినండి.


జ్వరం : మిగిలిపోయిన ఆహారాలను తింటే జ్వరం కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎదుకంటే మిగిలిపోయిన ఆహారంలో ఉండే బ్యాక్టీరియా సంక్రమణకు కారణమవుతుంది. ఇది వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాలను తింటే మాత్రం జ్వరం ఖచ్చితంగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే మీరు బలహీనంగా కూడా మారుతారు. అయితే మీరు మిగిలిపోయిన గుడ్లను, అన్నం, సీఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ప్రాణాంతకంగా మారుతుంది. 

Latest Videos

click me!