ఆ అన్నం వండి మరీ ఎక్కువ గంటలు అయ్యి ఉండి.. దానిని మళ్లీ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తీినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కొందరికి అయితే.. చద్దన్నం తినడం వల్ల జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా వచ్చేస్తాయి. మరి కొందరికి ఫుడ్ పాయిజన్ అయ్యి.. ఆస్పత్రిలో చేరాల్సి వస్తుంది. కాబట్టి.. వీలైనంత వరకు వండిన ఆహారాన్ని వెంటనే తినేయాలి. అలా కాకుండా.. వండిన తర్వాత ఎక్కువ గంటలు ఆగి ఆ తర్వాత తింటే.. చాలా ఆరోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పెడతాయి.