దొండకాయ తింటే తెలివి పెరుగుతుందా? తగ్గుతుందా?

First Published | Nov 5, 2024, 10:47 AM IST


దొండకాయ తింటే మాత్రం మతిమరుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది అని చెబుతుంటారు. మరి ఇందులో నిజముందా? నిజంగా దొండకాయ మంచిది కాదా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ivy gourd

దొండకాయ తో ఏం చేసినా రుచి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా దొండకాయ ఫ్రై రుచికి మరోటి సాటి రాదనే చెప్పాలి. కానీ.. మీరు విన్నారో లేదో తెలీదు కానీ.. ఎక్కువగా ఇంట్లో ఎవరైనా పెద్దలు ఉంటే.. దొండకాయ తింటే మంద బుద్ధి వస్తుంది అని చెబుతూ ఉండేవారు. దాదాపు అన్ని కూరగాయల వల్ల తెలివి వస్తుంది, చదువు వస్తుంది అని చెప్పే మన పెద్దలు.. దొండకాయ తింటే మాత్రం మతిమరుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది అని చెబుతుంటారు. మరి ఇందులో నిజముందా? నిజంగా దొండకాయ మంచిది కాదా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

నిజానికి దొండకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాయల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. అంతేకాదు.. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే దొండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. మరి, దీనిని తినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం

దొండకాయలో సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటుంది.ఫలితంగా మన శరీరంలో కొలిస్ట్రాల్ ని కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. వీటిని తినడం వల్ల  గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.


ఈ దొండకాయలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మనకు ఎలాంటి జీర్ణ సమస్యలు రావు. తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమౌతుంది. ఎలాంటి అరుగుదల సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

దొండకాయను రెగ్యులర్ గా తినడం వల్ల  బీపీ లాంటి సమస్యలు రావు. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. హై బీపీ సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే  ఈ దొండకాయను తింటే చాలు.

అంతేకాదు.. బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ.. ఈ దొండకాయను తింటే సరిపోతుంది. బరువును కంట్రోల్ లో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల.. అధిక బరువు పెరిగే ప్రమాదం ఉండదు.

అంతేకాదు దొండకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి.. అనిమియా లాంటి రక్త హీనత సమస్య రాకుండా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాదు.. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచడంలోనూ సహాయపడుతుంది. షుగర్ పేషెంట్స్ కి కూడా  ఈ దొండకాయ మంచి ఆరోగ్యకరమైన కూరగాయ. అంతేనా.. ఎముకలు బలహీనంగా మారకుండా.. ఆరోగ్యంగా, దృఢంగా ఉంచడంలోనూ హెల్ప్ చేస్తుంది.

Latest Videos

click me!