1 నెల పాటు రాత్రిపూట తినకపోతే ఏం జరుగుతుంది?

First Published Mar 30, 2024, 1:18 PM IST

బరువు తగ్గాలనుకునేవారు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. కొంతమంది వీటిలో సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం కారు. అయితే చాలా మంది బరువు తగ్గాలని రాత్రిపూట భోజనం మానేస్తుంటారు. దీనివల్ల ఏం జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి

చాలా మంది బరువు తగ్గడానికని భోజనాన్ని స్కిప్ చేస్తుంటారు. ఇందుకోసం కొంతమంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే.. మరికొంతమంది మాత్రం రాత్రి భోజనం మానేస్తుంటారు. వరుసగా మీరు 1 నెల పాటు రాత్రిపూట తినకపోతే ఏమి జరుగుతుందని మీరెప్పుడైనా ఆలోచించారా? బరువు తగ్గడానికని రాత్రి భోజనం స్కిప్ చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 

కేలరీలు తీసుకోవడం తగ్గుతుంది

ఉదయం, మధ్యాహ్నం తిన్నా, తినకపోయినా రాత్రి పూట ఖచ్చితంగా తినాలని పెద్దలు చెప్తుంటారు. ఎందుకంటే ఇదే మనల్ని బలంగా ఉంచుతుందని నమ్ముతారు. అయితే మీరు రాత్రిపూట భోజనం మానేయడం వల్ల పెద్దగా ఏం జరగదు. ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఫేవర్ కూడా చేస్తుంది. అవును రాత్రి పూట భోజనం మానేయడం వల్ల మీరు కేలరీల తీసుకోవడం సున్నా అవుతుంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది.

weight loss

జీవక్రియను పెంచుతుంది

జీవక్రియ మెరుగ్గా ఉన్నప్పుడే బరువు తగ్గడం సులువు అవుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారి జీవక్రియ ఎక్కువగా ఉండాలి. అయితే రాత్రిపూట మన జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. మీరు రాత్రిపూట భోజనం మానేస్తే అది మీ జీర్ణవ్యవస్థను రిలాక్స్ చేస్తుంది. అలాగే జీవక్రియ పెరుగుతుంది.
 

జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.

రాత్రి సమయంలో జీర్ణశక్తి బలహీనపడుతుంది. అందుకే రాత్రిపూట హెవీగా తింటే అరగదు. అజీర్థి సమస్యలు వస్తాయి. అందుకే రాత్రిపూట తేలికపాటి భోజనం చేయాలని నిపుణులు చెబుతుంటారు. అయితే మీరు రాత్రిపూట మొత్తమే తినకపోతే మీ జీర్ణక్రియ మెరుగవుతుంది.

అతిగా తినడం మానుకోండి

రాత్రిపూట భోజనం చేయకపోతే శరీరంలోని సిర్కాడియన్ గడియారం సక్రమంగా పనిచేస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీరు రాత్రిపూట తినాలనుకున్నా హెవీగా తినకండి. ఇధి మీ బరువును మరింత పెంచుతుంది. 

బాగా నిద్రపోండి

నిద్ర మీరు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మీరు కంటినిండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి. మీరు ప్రతిరోజూ డిన్నర్ మానేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అలాగే అన్ని హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. దీనివల్ల రాత్రిపూట బాగా నిద్ర పడుతుంది. 

weight loss

ఉబ్బరం ఉండదు

లేట్ నైట్ ఫుడ్ తిని తిన్న తర్వాత నిద్రపోయేవారికి కడుపు ఉబ్బరం సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ దీనివల్ల నిద్ర సరిగ్గా పట్టదు. మీరు రాత్రిపూట డిన్నర్ మానేయడం వల్ల కడుపు ఉబ్బరం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. 

డిన్నర్ మానేయడం ఎంతవరకు కరెక్ట్?

రాత్రిపూట భోజనం మానేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలతో పాటుగా చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిద్రపోవడానికి ముందు చాలా తేలికపాటి ఆహారాన్ని తినండి. ఉదాహరణకు, సూప్ తాగండి లేదా సలాడ్ ను తినండి సరిపోతుంది.
 

click me!