చింతపండు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 4, 2024, 4:00 PM IST

చింతపండును కొంతమంది చాలా ఇష్టంగా తింటుంటారు. చేసిన ప్రతి కూరలో చింతపండును వేస్తుంటారు. అసలు రోజూ చింతపండును తింటే ఏమౌతుందో తెలుసా? 
 

tamarind

బరువు తగ్గడం

చింతపండులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది తెలుసా? చింతపండులో హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వులను నిల్వ చేసే ఎంజైమ్లను నిరోధిస్తుంది. ఇది మీరు  ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

జ్వరాన్ని నయం చేస్తుంది

మీకు తెలుసా? చింతపండు సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగం. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే జ్వరానికి చింతపండు రసం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జ్వరాన్ని తగ్గిస్తాయి.

Latest Videos


మధుమేహాన్ని తగ్గిస్తుంది

శరీరంలో కార్బోహైడ్రేట్లు పేరుకుపోవడం వల్ల అది చక్కెర లేదా కొవ్వుగా మారడం ప్రారంభిస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం మొదలవుతుంది.  దీన్ని నియంత్రించడానికి డయాబెటిస్ ఉన్నవారు చింతపండును తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. చింతపండును తింటే శరీరం కార్బోహైడ్రేట్లను గ్రహించడం ఆపివేస్తుంది.  దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
 


లివర్ డ్యామేజ్ ను నివారిస్తుంది

చింతపండు ఎన్నో రోగాలకు మనల్ని దూరంగా ఉంచుతుంది. చింతపండులో విటమిన్ ఇ, సెలీనియం, ప్రొసియానిడిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రీరాడికల్స్ వల్ల కాలేయం దెబ్బతినకుండా నివారిస్తుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది

చింతపండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇది మన జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి, శుభ్రంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

Image: Getty Images

గుండెను కాపాడుతుంది.

చింతపండులో ఉండే ఫైబర్ కంటెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఈ చింతపండు మనకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

tamarind

ముక్కు దిబ్బడ ఉపశమనం

చింతపండులోనే ఉండే వెచ్చనిదనం, కఫాన్ని సమతుల్యం చేసే లక్షణాలు శ్వాసనాళం నుంచి శ్లేష్మాన్ని తొలగిస్తాయి. అలాగే నాసికా రద్దీని తగ్గిస్తాయి. ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం పొందడానికి చింతపండు బాగా ఉపయోగపడుతుంది. 

click me!