ఫుడ్ లో ఇంగువ కలిపి తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 3, 2024, 3:55 PM IST

ఇంగువను చాలా వంటల్లో వేస్తుంటారు. చిటికెడు ఇంగువ వంటలను టేస్టీగా చేస్తుంది. అయితే ఇది ఆహారానికి సువాసన, రుచిని ఇవ్వడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇంగువ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మంది దీనిని ఆహారం రుచి పెరగడానికి ఉపయోగిస్తుంటారు. కానీ దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపులో వాయువు, ఆమ్లత తగ్గుతుంది. కడుపు నొప్పి వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు ఇది దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 

ఇంగువ  ఫెరులా-ఫోటిడా అని పిలువబడే మొక్క రసం. దీన్ని ఎండబెట్టి ఇంగువను తయారుచేస్తారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, బలూచిస్తాన్, కాబూల్ పర్వత ప్రాంతాల్లో దీని దిగుబడి ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో దీన్ని చాలా అరుదుగా పండిస్తారు. 
 

Latest Videos



నిజానికి మన రోజువారి ఆహారంలో చిటికెడు ఇంగువను చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. ఇది మన రోగనిరోధక శక్తిని బలంగా చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చిటికెడు ఇంగువ మనకు మరెన్నో ప్రయోజనాలను ఇస్తుంది. అందుకే ఎన్నో ఏండ్ల నుంచి దీనిని ఆహారంలో ఉపయోగిస్తున్నారు. ఇంగువ వల్ల మనకు ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఇంగువలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా కూడా చేస్తుంది. 

ఇంగువ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించడంతో పాటుగా ఇతర చర్మ సమస్యలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.  ఇంగువ వివిధ రకాల సూక్ష్మక్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది.

ఇంగువ అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది పీరియడ్స్ సమయంలో నొప్పి, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇంగువలో ఉండే మూలకాలు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడతాయి. ఇది హృదయ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇది రక్తం సన్నబడటానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే రక్త ప్రవాహాన్ని నార్మల్ గా ఉంచుతుంది. 

ఇంగువ ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది కడుపు సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను నియంత్రించడంలో ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.  అలాగే ఇది దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.  ఇంగువ శ్వాసనాళాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది.

click me!