ఎండాకాలంలో పుచ్చకాయను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తింటే శరీరంలో నీటి లోపం తొలగిపోతుంది. అలాగే మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. పుచ్చకాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందడానికి దీన్ని సరైన సమయంలోనే తినాలి. అసలు పుచ్చకాయను పరిగడుపున తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పుచ్చకాయ లక్షణాలు
ఎండాకాలంలో పుచ్చకాయలు బాగా అమ్ముడవుతాయి. ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రోజూ పుచ్చకాయను తినడం వల్ల మన శరీరం ఎన్నో వ్యాధులకు దూరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండును తింటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న రోగాలు రావు. అలాగే జ్వరం వంటి వ్యాధులు కూడా తొందరగా తగ్గిపోతాయి.
ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం ఎంత వరకు సరైంది?
కొంతమంది ఉదయం లేచిన వెంటనే పరిగడుపున పుచ్చకాయను తింటుంటారు. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను లంచ్ తర్వాత లేదా డిన్నర్ తర్వాత తినొచ్చు. ఇది కాకుండా నిద్రపోవడానికి 2 గంటల ముందు కూడా ఈ పండును తినొచ్చు.
లూజ్ మోషన్
పుచ్చకాయను పరిగడుపున తినడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిలో లూజ్ మోషన్స్ ఒకటి. అవును పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినడం వల్ల విరేచనాలు లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అందుకే పుచ్చకాయను పరిగడుపున అస్సలు తినకూడదు.
కాలేయ సమస్యలు
పుచ్చకాయను పరగడుపున తింటే కాలేయ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు ఇంతకు ముందే కాలెయ సమస్యలు ఉంటే కూడా పరిగడుపున పుచ్చకాయను తినడం మానుకోండి.
పీసీఓడీ సమస్య
పీసీఓడీ సమస్యలు ఉన్నవారు కూడా ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది పీసీఓడీ సమస్యను మరింత పెంచుతుంది.
డయాబెటిస్ లో తినకూడదు
డయాబెటిస్ పేషెంట్లు కూడా పుచ్చకాయను పరిగడుపున తినకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇతర సమయాల్లో దీన్ని తిన్నా కూడా లిమిట్ లోనే తినాలి.