నెలరోజులపాటు రోజూ ఉసిరి తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Oct 22, 2024, 1:44 PM IST

ఉసిరికాయ జ్యూస్ ని నెల రోజుల పాటుు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండా తాగితే ఏమౌతుందో తెలుసా? దీని వల్ల మన శరీరంలో కలిగే మార్పులు ఏంటో చూద్దాం…

amla juice

ఉసిరి ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్  అందిస్తుంది. అంతేకాదు.. రెగ్యులర్ గా ఉసిరి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుతుంది. మరి.. ఈ ఉసిరికాయ జ్యూస్ ని, లేదంటే ఉసిరికాయను నెల రోజుల పాటుు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకండా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? దీని వల్ల మన శరీరంలో కలిగే మార్పులు ఏంటో చూద్దాం…

ఉసిరి రసం తాగడం మొదలుపెట్టిన మొదటి మూడు రోజుల్లోనే చాలా మార్పులు వస్తాయి ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.  ఉసిరిలో ఉండే విటమిన్లు, పోషకాల కారణంగా.. శరీరానికి శక్తి కూడా వస్తుంది. కేవలం ఈ మూడు రోజుల్లోనే  శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి సహాయం చేస్తుంది.

amla juice

వారంరోజుల పాటు వరసగా ఈ ఉసిరి జ్యూస్ తాగడం వల్ల.. రోగనిరోశక శక్తి మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల  జలుబు వంటి ఇన్ఫెక్షన్లు రావడం తగ్గుతాయి. అంతేకాదు.. వారం రోజుల్లో మీ చర్మంలో గ్లో కూడా పెరగడం మొదలౌతుంది. ముఖంపై మచ్చలు తగ్గుతాయి. అందంగా కనిపిస్తారు. అంతేకాదు..కడుపు ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. ఎసిడిటీ సమస్యలు కూడా తగ్గుతాయి.

ఇక, రెండు వారాల పాటు ఉసిరి జ్యూస్ తాగడం వల్ల.. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా మారడమే కాకుడా.. మెరిసేలా చేస్తుంది.  జుట్టురాలడం సమస్య కూడా తగ్గుతుంది.

మీరు జీవక్రియలో పెరుగుదలను గమనించవచ్చు, బహుశా మరింత శక్తివంతంగా, తక్కువ అలసటగా అనిపించవచ్చు. మీరు బరువు తగ్గడానికి కృషి చేస్తుంటే, ఈజీగా బరువు తగ్గడం కూడా మొదలౌతుంది. కడుపు ఉబ్బరం సమస్య కూడా తగ్గుతుంది.


amla juice

వరసగా 15 నుంచి 21 రోజులపాటు ఈ ఉసిరి జ్యూస్ తాగడం వల్ల  రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. జలుబు, దగ్గు మాత్రమే కాదు.. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక.. స్కిన్ గ్లో మరింత పెరుగుతుంది. చర్మం హైడ్రేటెడ్ గా మారుతుంది. ప్రకాశవంతంగా కూడా మారుతుంది. డార్క్ స్పాట్స్, నల్ల మచ్చలు కూడా రాకుండా ఉంటాయి.

జీర్ణక్రియ, ప్రేగు ఆరోగ్యం: మీరు ఇంతకు ముందు మలబద్ధకం లేదా అజీర్ణంతో బాధపడినట్లయితే, ఈ లక్షణాలు ఈ సమయంలో పూర్తిగా పరిష్కరించగలరు. జీర్ణక్రియ సాఫీగా అనిపిస్తుంది. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

జుట్టు పెరుగుదల: జుట్టు రాలడం తగ్గడం లేదా జుట్టు పల్చబడడం తగ్గడం మీరు గమనించవచ్చు. జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ, మందంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కొలెస్ట్రాల్, గుండె ఆరోగ్యం: మీరు అధిక కొలెస్ట్రాల్ లేదా రక్తపోటు కలిగి ఉంటే, మీరు మరింత సమతుల్య స్థాయిలను గమనించవచ్చు. అంతేకాదు.. ఈజీగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

ఇక వరసగా నెల రోజుల పాటు ఉసిరి కాయ రసం తాగడం వల్ల.. శరీరానికి అవసరమైన శక్తి, మానసిక స్థితి మెరుగుపరుస్తుంది. రోజంతా శక్తివంతంగా ఉంటారు. ఒత్తిడి తగ్గిపోతుంది. మానసిక స్పష్టత మెరుగుపడుతుంది. ఉసిరి మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది కాబట్టి, మెరుగైన అభిజ్ఞా విధులు, మెరుగైన దృష్టి, పదునైన జ్ఞాపకశక్తి గమనించవచ్చు. మీకు కీళ్ల నొప్పులు ఉన్నట్లయితే, మంట గణనీయంగా తగ్గిపోయి ఉండవచ్చు, ఇది మీ కీళ్లలో మెరుగైన కదలిక, తక్కువ దృఢత్వాన్ని ఇస్తుంది. షుగర్ లెవల్స్ మెరుగుపడతాయి.

Latest Videos

click me!