మొలకల్ని రోజూ తింటే ఏమౌతుంది?

First Published Oct 22, 2024, 1:25 PM IST

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో చిట్కాలను ఫాలో అవుతున్నారు. వీటిలో మొలకలు తినడం కూడా ఉంది. అయితే రోజూ మొలకల్ని తింటే ఏమౌతుందో తెలుసా? 

sprouts

గింజలు, విత్తనాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిని మొలకలుగా తింటే మీరు రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. మొలకల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు రెట్టింపు అవుతాయి. అంతేకాదు వీటిలో ఎన్నో ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. 

పెసర్లు, బ్రస్సెల్, రాగులు వంటి మొలకలను ఎంచక్కా తినొచ్చు. ఇవి మీ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మొలకలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినడం చాలా మంచిది.

కొంతమంది వీటిని సలాడ్ గా కూడా తింటారు. మరికొంతమంది మాత్రం ఉడకబెట్టి, చాట్ లాగా కూడా తింటుంటారు. అందుకే రోజూ మొలకల్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

మొలకల్లోని పోషకాలు

మొలకెత్తని విత్తనాలు, బీన్స్ లేదా గింజలతో పోలిస్తే.. వీటిని మొలకెత్తిన  తర్వాత తింటేనే వీటిలో పోషకాలు రెట్టింపు అవుతాయి. మీకు తెలుసా? మొలకల్లో ఐరన్,  మెగ్నీషియం, జింక్, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, ఫోలేట్, ఫాస్పరస్, ప్రొటీన్లు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటాయి.
 

Latest Videos


green gram sprouts

మెరుగైన జీర్ణక్రియ

రోజూ మొలకల్ని మర్చిపోకుండా తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. వీటిని తినడం వల్ల మీ శరీరం అనేక రసాయన ప్రతిచర్యలతో పాటు జీర్ణక్రియ ప్రక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మొలకలు మలబద్దకం, అపానవాయువు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. 

వృద్ధాప్య ప్రక్రియ

మొలకలు మన చర్మానికి మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ మొలకల్లో ఫైటోకెమికల్స్, బయోఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంటే రోజూ మొలకల్ని తినడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను మందగిస్తుంది. దీంతో మీ ముఖంపై ముడతలు, మచ్చలు తొందరగా ఏర్పడవు. 

నిర్విషీకరణ

మొలకల్లో క్లోరోఫిల్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే ఇది సెల్యులార్ స్థాయిలో డిటాక్సిఫై చేస్తుంది. దీతో అంతర్గత ప్రక్షాళన జరుగుతుంది.

మొలకల్లో ఐరన్ కంటెంట్ మెండుగా ఉండటం వల్ల మీకు  ఉన్న రక్తహీనత సమస్య కూడా తొలగిపోతుంది. అంతేకాదు దీంట్లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఒంట్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

బరువు తగ్గుతారు

ఫైబర్ మొలకల్లో పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి మీరు అతిగా తినకుండా చేస్తుంది. అలాగే దీంట్లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి మొలకలు ఎంతో సహాయపడతాయి. మొలకల్ని తింటే మలబద్దకం సమస్య కూడా తగ్గిపోతుంది. 

మొలకల్ని వీళ్లు తినకూడదు? 

గర్భిణీస్త్రీలు, పిల్లలు, వృద్ధులు పచ్చి మొలకల్ని తినకూడదు. ఎందుకంటే వీళ్లకు ఈ మొలకలు అంత సులువుగా జీర్ణం కావు. కాబట్టి వీటిని తింటే వీరు అజీర్ణంతో బాధపడతారు. అందులోని వీరి ఇమ్యూనిటీ పవర్ కూడా బలహీనంగా ఉంటుంది.

ఇది ఫుడ్ ద్వారా వచ్చే జబ్బులు లేదా ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు పెంచుతుంది. ఇలాంటివారు మొలకల్ని ఉడకబెట్టి అందులో జీలకర్ర, గరంమసాలా, ఇంగువ వంటి మసాలా దినుసులు కలుపుకుని తినాలి.
 

click me!