కొలెస్ట్రాల్ తగ్గడానికి మధ్యాహ్నం ఏ కూరలు తినాలో తెలుసా?

First Published Apr 13, 2024, 9:51 AM IST

కొలెస్ట్రాల్ తగ్గడాలంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం అన్నాన్ని కొన్ని కూరలతో కలిపి తింటే మీ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే మీరు ఫుడ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఫాస్ట్ ఫుడ్, రెడ్ మీట్, కొవ్వులు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం మానుకోవాలి. అలాగే మీరు ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. పండ్లు, కూరగాయలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.  మరి మీరు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానిక మీరు మధ్యాహ్నం పూట ఏం కూరగాయలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

బచ్చలికూర 

బచ్చలికూరలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. బచ్చలికూరను మధ్యాహ్నం అన్నంతో పాటు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. 
 

బ్రోకలీ

బ్రోకలీలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫైబర్ కంటెంట్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే బ్రోకలీని మీ రోజువారి ఆహారంలో చేర్చడం  వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బ్రోకలీ ఎన్నో వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
 

beetroot

బీట్ రూట్

బీట్ రూట్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మధ్యాహ్నం అన్నంతో పాటుగా బీట్రూట్ ను తీసుకోవడం వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

క్యారెట్లు

క్యారెట్లు విటమిన్ ఎ కు మంచి వనరులు. వీటిని తింటే కళ్లు బాగా కనిపిస్తాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే చర్మం కూడా హెల్తీగా ఉంటుంది. అయితే ఇది కొవ్వును కరిగించడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫైబర్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే క్యారెట్లను మధ్యాహ్నం అన్నంతో కలిపి తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
 

టమాటాలు

మనం టమాటాలను ప్రతి కూరలో ఉపయోగిస్తుంటాం. టమాటాలు లేని కూర అస్సలు ఉండదేమో. కానీ ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే టమాటాలు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి బాగా ఉపయోగపడతాయి. 
 

okra

బెండకాయ

బెండకాయ కాస్త జిగటగా ఉంటుంది. దీనివల్లే చాలా మంది ఈ కూరను తినరు. కానీ ఇది మన శరీరానికి ఎంతో ప్రయోజరకరంగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉండే బెండకాయ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

click me!