పుచ్చకాయ మరీ ఎర్రగా ఉందా..? కల్తీ కావచ్చు.. తెలుసుకునేదెలా..?

First Published Apr 12, 2024, 4:03 PM IST

పుచ్చకాయ మరీ ఎర్రగా ఉంది అంటే.. అది వరిజినల్ కాకపోవచ్చు. కాయ కల్తీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.  మరి మనం కొనే కాయ వరిజనల్ లేక.. కల్తీ అనే విషయం మనం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

water melon

ఎండాకాలంలో మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువగా పండ్లు తింటూ ఉంటాం. వాటిలో పుచ్చకాయ, మామిడి పండు, ద్రాక్ష ముందు వరసలో ఉంటాయి. బడ్జెట్ పరంగా అందరికీ అందుబాటులో పుచ్చకాయ ఉంటుంది. కాబట్టి.. ఎక్కువగా వీటినే కొంటూ ఉంటారు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి...ఇది తింటే బాడీ డీ హైడ్రేటెడ్ గా మారదు అని మనం అనుకుంటూ ఉంటాం.

water melon

మంచిగా కాయ లోపల ఎర్రగా, ఉండాలి.. రుచి తియ్యగా ఉండాలి అని చూసి చూసి మరీ పుచ్చకాయ కొంటూ ఉంటారు. మనం కొన్న కాయ ఎర్రగా ఉంటే.. అబ్బా.. మంచి కాయ కొన్నాం అని తృప్తి పడుతూ ఉంటాం. కానీ.. ఈ రోజుల్లో అలా మార్కెట్లో దొరికే అన్ని కాయలను నమ్మలేం. ముఖ్యంగా పుచ్చకాయ మరీ ఎర్రగా ఉంది అంటే.. అది వరిజినల్ కాకపోవచ్చు. కాయ కల్తీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.  మరి మనం కొనే కాయ వరిజనల్ లేక.. కల్తీ అనే విషయం మనం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

చాలా మంది పుచ్చకాయ కొనేటప్పుడు దానిని చిన్న ముక్క కోయించి.. అది ఎర్రగా ఉంటే మంచి కాయ అని నిర్థారించుకొని మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ.. అలా ఎర్రగా కనిపించడానికి వాటికి ఇంజక్షన్లు చేస్తున్నారనే విషయం మీకు తెలుసా? నమ్మలేకపోయినా నిజం.. ఈ ప్రపంచంలో వేటినైనా కల్తీ చేయవచ్చు కానీ.. పండ్లను కల్తీ చేయలేరు అనుకుంటూ ఉండే వాళ్లం. కానీ.. ఆ పండ్లను కూడా కల్తీ చేసేస్తున్నారు. కాయ ఎర్రగా కనిపించి ఆకర్షించేలా ఉండటానికి పుచ్చకాయకు లోపల ఇంజెక్షన్లు చేస్తున్నారట. మన కంటికి మాత్రం ఆ కాయలు ఎర్రగా.. మంచిగా జ్యూసీగా కనిపిస్తూ ఉంటాయి. మనం వాటి మాయలో పడి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం.

water melon


అలా అని ఎర్రగా ఉన్న ప్రతికాయ అలా ఇంజెక్షన్ చేసిందే అవ్వాలని రూలేమీ లేదు. కొన్ని సహజంగానే ఎర్రగా ఉండి ఉండొచ్చు. అయితే.. ఓ చిన్న చిట్కాత మనం కొన్న కాయ ఇంజెక్షన్ చేసిందో కాదో తెలుసుకోవచ్చని ఫుడ్ సేఫ్టీ సంస్థ చెబుతోంది. 

పుచ్చకాయలో కల్తీ ఉందో లేక ఇంజెక్షన్ ఇచ్చిందో గుర్తించేందుకు పండ్లను రెండు భాగాలుగా కట్ చేయాలి. తర్వాత పుచ్చకాయను రెండు భాగాలుగా కట్ చేసి, దూదితో చిన్న బాల్స్ చేయండి. ఇప్పుడు పుచ్చకాయపై కాటన్ బాల్‌ను కొద్దిసేపు రుద్దండి. పుచ్చకాయ ఎరుపు రంగు నిజమైతే, దూది ఎరుపు రంగులోకి మారదు. కేవలం.. తడుస్తుంది అంతే.

అలా కాకుండా...దూది కనుక.. ఎర్రగా మారిపోయింది అంటే.. అది నిజమైనది కాదని..  ఇంజెక్షన్లు చేసిన కల్తీ కాయ అని తేలిపోతుంది. ఇలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యం బాగా ఉండటం పక్కన పెడితే.. అనారోగ్య సమస్యలు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. జాగ్రత్తగా చూసి కొనుగోలు చేయండి. 

click me!