మనం వంటలో చాలా రకాల మసాలాలను ఉపయోగిస్తూ ఉంటాం. అయితే, వాటిలో కొన్ని మసాలాలు, సుగంద ద్రవ్యాలు తీసుకోవడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని మసాలా దినుసులు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణాల నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గడానికి సంబంధించి, సుగంధ ద్రవ్యాలు పరోక్షంగా ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు తోడ్పడతాయి. అవి తక్కువ కేలరీల వంటకాల రుచి, వాసనను పెంచుతాయి, వాటిని మరింత ఆనందదాయకంగా, సంతృప్తికరంగా చేస్తాయి.