బరువు తగ్గించే స్నాక్స్...ఈ వర్షాకాలానికి బెస్ట్

First Published | Jul 6, 2023, 11:53 AM IST

కింది స్నాక్స్ మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం పంచడంతో పాటు, బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. అంతేకాకుండా  స్నాక్స్ తినాలనే కోరిక కూడా కలుగుతుంది. మరి అలాంటి స్నాక్స్ ఏంటో ఓసారి చూద్దాం..
 

వర్షాకాలం మొదలైపోయింది. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఓ వైపు వర్షాలు పడుతూ ఉంటే, సరదాగా ఏవైనా స్నాక్స్  వేడిగా, కారంగా తినాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు తినాలి అనిపించిన స్నాక్స్ అన్నీ తినేస్తే, బరువు సులభంగా పెరిగిపోతూ ఉంటాం. కానీ, ఈ కింది స్నాక్స్ మాత్రం ఆరోగ్యానికి ఆరోగ్యం పంచడంతో పాటు, బరువు తగ్గేందుకు సహాయం చేస్తాయి. అంతేకాకుండా  స్నాక్స్ తినాలనే కోరిక కూడా కలుగుతుంది. మరి అలాంటి స్నాక్స్ ఏంటో ఓసారి చూద్దాం..

1.మొక్కజొన్న చాట్..

మొక్క జొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని మీరు వర్షాకాలంలో పర్ఫెక్ట్ స్నాక్ గా తీసుకోవచ్చు. ఈ మొక్క జొన్న తో చాట్ మసాలా, నిమ్మరసం ఉపయోగించి  చాట్ తయారు చేసుకోవాలి. ఇది రుచి రుచి అందిస్తుంది. సులభంగా బరువు  తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Latest Videos


2.డేట్స్, ఓట్స్ కుకీస్...

కుకీస్, బిస్కెట్స్ ఆరోగ్యానికి మంచివి కావు. కానీ, ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన కుకీస్ లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో డేట్స్, ఓట్స్ కుకీస్ లాంటివి అందుబాటులో ఉంటుున్నాయి. అలాంటి వాటిని ఈ వర్షాకాలంలో హాయిగా తినవచ్చు. వీటి కారణంగా బరువు పెరుగుతామనే భయం ఉండదు.

Image: Freepik

3.మూంగ్ దాల్ చిల్లా..
మూంగ్ దాల్ చిల్లా సైతం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కూడా బరువు పెంచుతుందనే భయం ఉండదు. దీనిలో ప్రోటీన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

4.భేల్..
మరమరాలతో తయారు చేసిన భేల్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో  క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇవి తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ వర్షాకాలంలో వీటిని చక్కగా ఆస్వాదించవచ్చు.

oats dosa


5.ఓట్స్ ఉత్తప్పం..
ఈ వర్షాకాలంలో ది బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ ఉతప్పాన్ని చెప్పొచ్చు. దీనిలో మనకు నచ్చిన కూరగాయాలను కూడా కలుపుకోవచ్చు. ఫైబర్ ఉండటంతో పాటు, న్యూట్రియంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

6.రాగి మురుకులు..
చాలా మంది ఇంట్లో మురుకులు చేసుకుంటూ ఉంటారు. అయితే, ఈ మురకులను బియ్యం పిండితో కాకుండా, రాగి పిండితో చేుసకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు

makhana

7.ఫూల్ మఖానా..
పొద్దు తిరుగుడు పువ్వు గింజల నుంచి ఈ ఫూల్ మఖానా తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు రుచికి కూడా కమ్మగా ఉంటాయి. 

click me!