రష్మిక ఫేవరేట్ డిష్.. ఎలా తయారు చేయాలో తెలుసా?

Published : Jul 05, 2023, 10:48 AM IST

ఆమె కి ఫ్రెంచ్ డిసర్ట్ ఒకటి అంటే బాగా ఇష్టమట. మరి ఆ డిసర్ట్ ఏంటి? దానిని ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం..

PREV
17
  రష్మిక ఫేవరేట్ డిష్.. ఎలా తయారు చేయాలో తెలుసా?
Photo Courtesy: Instagram

నేషనల్ క్రష్ రష్మిక వరస సినిమాలతో దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్ లో ఆమె అవకాశాలు అందుకుంటోంది. ఓ వైపు అల్లు అర్జున్ తో పుష్ప2లో నటిస్తోంది. మరో వైపు హిందీలో  రణబీర్ తో కలిసి యానిమల్ లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

27
Rashmika Mandanna

కాగా, రష్మిక ఫుడ్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటుందట. ఆమె ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈ విషయాన్ని ఆమె చాలా సార్లు సోషల్ మీడియాలో రీల్స్ ద్వారా తెలియజేశారు. కాగా, ఆమె ఇటీవల తనకు నచ్చిన ఓ డిస్టర్ గురించిబయటపెట్టారు.ఆమె కి ఫ్రెంచ్ డిసర్ట్ ఒకటి అంటే బాగా ఇష్టమట. మరి ఆ డిసర్ట్ ఏంటి? దానిని ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం..
 

37
pineapple

తనకు నచ్చిన ఫ్రెంచ్ టోస్ట్ ని ఆమె షేర్ చేశారు. దానికి షేర్ చేసి ఆమె ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. తాను చీట్ డేస్ లో డిసర్ట్ తినడానికి ఇష్టపడతానని చెప్పారు. మరి ఆమెకు ఎంతో నచ్చిన ఫ్రెంచ్ టోస్ట్ ఎలా తయారు చేయాలో ఓసారి చూద్దాం..

47
scrubber as french toast prank

ఈ ఫ్రెంచ్ టోస్ట్ తయారీ కి కావాల్సిన పదార్థాలు.. పాలు, రెండు కోడిగుడ్లు, ఒక టీస్పూన్  వెనిలా ఎక్సాట్రాక్ట్,  పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొద్దిగా రుచి తగినంత ఉప్పు, 4 బ్రెడ్ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పులేని బట్టర్, ఒక అరటి పండు, కొద్దిగా బెర్రీలు, ఒక టేబుల్ స్పూన్ షుగర్, ఒక టీస్పూన్ బాదం పలుకులు, ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్

57

bread toast

ఇప్పుడు తయారీ విధానం చూద్దాం... ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులో పాలు, కోడి గుడ్లు వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో వెనీలా ఎక్స్ ట్రాక్ట్, దాల్చిన చెక్క పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.

67
Image: Getty

ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ మీద బట్టర్ వేసి  బాగా వేడి చేయాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని వాటిని ముందుగా కలిపి ఉంచకున్న పాలు, కోడిగుడ్డు సొన మిక్స్ లో రెండు వైపులా ముంచాలి. దానిని ఇప్పుడు బటర్ మీద రెండు వైపులా కాల్చాలి.
 

77

ఇప్పుడు ఈ కాల్చిన బ్రెడ్ మీద అరటి పండు, బెర్రీలు , షుగర్, బాదం పలుకులు వేసి గార్నిష్ చేయాలి. అంతే, వేడి వేడిగా తినేస్తే సరిపోతుంది. రష్మికకు నచ్చిన స్వీట్ ఇది. మీరు కూడా ఓసారి ప్రయత్నించండి. 

click me!

Recommended Stories