ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుట ఉన్న సమస్య బరువు. తెలిసీ తెలియక జంక్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది ఉండాల్సిన దానికన్నా అధిక బరువు పెరిగిపోయి.. దానిని తగ్గించడానికి అనేక తిప్పలు పడుతున్నారు.
undefined
ఈ క్రమంలో బరువు తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. అయితే.. అలా బరువు తగ్గించే పనిలో ఉన్న వారు ఏ ఆహారం పడితే అది తినలేరు. ఏది తింటే మళ్లీ బరువు పెరుగుతామో అనే భయంలో ఉండిపోతారు. మరీ ముఖ్యంగా అర్థరాత్రి సమయంలో, స్నాక్స్ విషయంలో చాలా సార్లు ఆలోచిస్తారు
undefined
అయితే...ఈ స్నాక్స్ మాత్రం ఏ సమయంలోనైనా.. అర్థరాత్రి కూడా తొనచ్చట. అయినప్పటకీ.. బరువు పెరుగుతామనే భయం కొంచెం కూడా ఉండదట. ఆ ఫుడ్స్ ఏంటో ఓ సారి చూసేద్దామా..
undefined
1. వేయించిన ఫాక్స్ నట్స్( Roasted foxnuts)సాధారణంగా మఖానా అని పిలుస్తారు, రోస్ట్ చేసిన ఫాక్స్ నట్స్ అర్ధరాత్రి స్నాక్స్ గా తీసుకోవచ్చు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. కరకరలాడే విధంగా వేయించుకొని.. గాలి తగలని కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు.
undefined
2.రాగి చిప్స్రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. వాటితో తయారు చేసిన ఈ చిప్స్ తినడం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి దక్కుతాయి.
undefined
3.మరమరాలు.. ఈ మరమరాలను బియ్యంతో తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. వీటిలో ఎలాంటి ఫ్యాట్ కంటెంట్ ఉండదు. వీటిలో పల్లీలు, ఉల్లిపాయలు లాంటివి కలుపుకొని తినొచ్చు.
undefined
4.పండ్లు..మీ ఇంట్లో పైన చెప్పిన ఏ స్నాక్స్ అందుబాటులో లేవు అనుకుంటే.. చక్కగా పండ్లు తినొచ్చు. ఏ పండు తిన్నా ఏమీ కాదు.. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి.
undefined
5.పెరుగు..పెరుగు కూడా హాయిగా తినొచ్చు. నార్మల్ పెరుగు తినాలంటే బోర్ గా ఉంటే.. దానిలో కూడా ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయి. అలా మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అలా కాదు ఇంట్లోనే పెరుగు ఉంది అంటే.. అందులో పండ్లు, డ్రై ఫ్రూట్స్ వేసుకొని తినొచ్చు.
undefined