ఈ ఫుడ్స్ తో నడుంచుట్టూ పేరుకున్న కొవ్వు.. హాంఫట్..

First Published Feb 22, 2021, 1:01 PM IST

నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికోసం అనేక రకాల వ్యాయామాలు చేస్తారు. మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు కూర్చుని ఉండాల్సి రావడం.. ఇలా బెల్లీ ఫ్యాట్ కు అనేక రకాల కారణాలు ఉన్నాయి. 

నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వు చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికోసం అనేక రకాల వ్యాయామాలు చేస్తారు. మారుతున్న జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, ఎక్కువ సేపు కూర్చుని ఉండాల్సి రావడం.. ఇలా బెల్లీ ఫ్యాట్ కు అనేక రకాల కారణాలు ఉన్నాయి.
undefined
దీనికోసం అనేక రకాల వ్యాయామ విధానాలను అనుసరిస్తూ ఉంటారు. అయితే నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఎక్సర్ సైజులు ఒక్కటే సరిపోవు. దీనికోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలి. లో క్యాలరీ ఫుడ్స్ ను, జీరో క్యాలరీ ఫుడ్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. అవేంటో చూడండి..
undefined
కీర దోసకాయ : తక్కువ క్యాలరీలు ఉండే కీర దోసకాయను ఇష్టపడని వారు ఉండరు. ఇందులో అతి తక్కువ క్యాలరీలతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
undefined
సెలెరీ : తోటకూర లాగా కనిపించే ఒకరకమైన ఆకుకూర. ఇందులో క్యాలరీలో అస్సలు ఉండవు. జీరో క్యాలరీలన్నమాట. దీంట్లో 95% నీరు ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 100 గ్రాముల సెలెరీలో 16 కేలరీలు మాత్రమే ఉంటాయి. విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్స్కు మంచి సోర్స్ ఈ సెలెరీ, దీన్ని జ్యూస్ గా, సలాడ్ గా కూడా తినొచ్చు.
undefined
క్యారెట్ : తక్కువ క్యాలరీలున్న ఆహార పదార్థం క్యారెట్. కంటి చూపును మెరుగుపరిచే ఆహారపదార్థంగా దీన్ని వాడతాం. అయితే ఒంట్లో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగించడంలో కూడా క్యారెట్ చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు బ్లెడ్ షుగర్ లెవల్స్ ని కూడా అదుపులో ఉంచుతుంది.
undefined
బ్రొక్కొలి : తక్కువ కేలరీలు, ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారపదార్థం బ్రొక్కొలి. అందుకే దీన్ని డైటింగ్ చేసేవాళ్లు చాలా ఇష్టపడతారు. అంతేకాదు బ్రొక్కొలిలో క్యాన్సర్‌తో పోరాడే సామర్థ్యం ఉంది. 100 గ్రాముల బ్రొక్కొలిలో 34 కేలరీలు మాత్రమే ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని ప్రయత్నించేవారికి బ్రొక్కొలి చాలా మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.
undefined
ఉల్లిపాయ : ఉల్లిపాయ లేనిది కూర చేయడం చాలా కష్టమైన విషయం. చాలా కూరల్లో ఉల్లిపాయ మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ ఉల్లిపాయల్లో కేలరీలు, ఫ్లేవనాయిడ్లు తక్కువగా ఉంటాయి. శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించే సామర్థ్యం ఉల్లిపాయల్లో అధికంగా ఉంటుంది.
undefined
click me!