Weight loss: రోజుకి ఎన్ని గుడ్లు తింటున్నారు..?

First Published | Aug 3, 2022, 9:33 AM IST

బరువు తగ్గాలి అనుకునేవారు ముందుగా.. తమ ఆహారంలో కార్బో హైడ్రేట్స్ ను దూరం పెట్టడంతో మొదలుపెడతారు. కోడి గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది.

ఈ రోజుల్లో బరువు తగ్గాలని ప్రయత్నించేవారు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలో ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు.. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ప్రోటీన్ అనగానే ఎవరైనా కోడిగుడ్డు,  చికెన్ తీసుకుంటారు. తమ రోజువారీ డైట్ లో కోడిగుడ్లు కచ్చితంగా ఉండేలా జాగ్రత్తపడతారు. గుడ్డు కూడా ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెబుతుంటారు. అయితే... బరువు తగ్గాలి అనుకునేవారు.. నిజంగా ఎక్కువ కోడిగుడ్లు తీసుకోవచ్చా..? రోజుకు రెండు తింటే పర్లేదు.. అంతకు మించి తింటే.. ఏం జరుగుతుంది..? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఓసారి చూద్దాం...


ఉడికించిన కోడి గుడ్లు తినడం  ఆరోగ్యానికి మంచిదే. కానీ అతిగా మాత్రం అస్సలు తీసుకోకూడదట. బరువు తగ్గాలి అనుకునేవారు ముందుగా.. తమ ఆహారంలో కార్బో హైడ్రేట్స్ ను దూరం పెట్టడంతో మొదలుపెడతారు. కోడి గుడ్డులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది.


 ఒక గుడ్డులో 75 కేలరీలు, 7 గ్రాముల అధిక-నాణ్యత ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు , 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు, ఐరన్, విటమిన్లు,ఖనిజాలు ఉంటాయి. కాబట్టి ఇవి తినడం వల్ల జీవక్రియను పెరుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  కానీ ఇతర ఆహారాలకు బదులుగా గుడ్లు మాత్రమే తినడం వల్ల బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంది. గుడ్లు అతిగా తినడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. 
 

egg

చాలా ఎక్కువ గుడ్లు కొంతమందిలో ఉబ్బరానికి కూడా దారితీయవచ్చు. పచ్చసొనను అధికంగా తీసుకోవడం కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి. కొందరిలో బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. 

కొంతమంది పోషకాహార నిపుణులు మీరు ఒక భోజనంలో గుడ్లు, మరొక భోజనంలో లీన్ మాంసం, మూడవ భోజనంలో క్లీన్ శాకాహార ప్రోటీన్ మూలాన్ని కలిగి ఉండాలని కూడా సిఫార్సు చేస్తున్నారు.రోజుకి ఒకటి లేదంటే.. రెండు గుడ్లు తీసుకోవచ్చు. కానీ.. భోజనం చేసిన ప్రతిసారీ కోడి గుడ్డు తినడం మాత్రం మంచిది కాదు. దానికి బదులు పాల కూర,  బచ్చలికూర, అవకాడో, పుట్టగొడుగులు, పచ్చి బఠానీలు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు.

Latest Videos

click me!