ఎండాకాలంలో సొరకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Apr 16, 2024, 7:46 AM IST

సొరకాయను ఎండాకాలంలో ఎక్కువగా తింటుంటారు. ఈ కూరగాయతో చేసిన కూర టేస్టీ టేస్టీగా ఉంటుంది. అయితే ఈ సొరకాయను తినడం వల్ల ఏమేమి లాభాలున్నాయో తెలుసా? 
 

ఎండాకాలంలో మన శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అయ్యి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ సీజన్ లో నీటిని పుష్కలంగా తాగడంతో పాటుగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తినాలి. ఇలాంటి ఆహారాలలో సొరకాయ ఒకటి. సొరకాయలో నీటి పరిమాణం చాలా ఉంటుంది. అందుకే ఎండాకాలంలో ఈ కూరగాయను తినడం ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. అసలు ఎండాకాలంలో సొరకాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

హైడ్రేషన్

సొరకాయలో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎండాకాలంలో బాడీ డీహైడ్రేషన్ సమస్య నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ కూరగాయ మన శరీరంలో ఎలక్ట్రోలైట్ల లోపాన్ని కూడా తీరుస్తుంది. అందుకే ఎండాకాలంలో ఈ కూరగాయను ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 

బరువు తగ్గడానికి..

సొరకాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే దీనిని తింటే శరీరంలో అదనపు కొవ్వులు నిల్వ కావు. అలాగే మీరు బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు. ఈ కూరగాయలో ఐరన్, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ కూడా ఉంటాయి. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే మీరు ఈ సీజన్ లో సొరకాయను తినొచ్చు. 
 

చర్మానికి మేలు 

సొరకాయ మన శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఇది మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోవడం వల్ల మొటిమలు వంటి చర్మ సమస్యలు వస్తాయి. అయితే సొరకాయలో ఉండే విటమిన్-సి, విటమిన్-ఎ చర్మాన్ని  ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సమస్యలు రాకుండా చూస్తాయి. 
 

బాడీ డిటాక్స్

సొరకాయను తిన్నా లేదా దాని రసాన్ని తాగినా శరీరంలోని టాక్సిన్స్ క్లియర్ అవుతాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. 

మెరుగైన జీర్ణక్రియ

సొరకాయలో పుష్కలంగా ఫైబర్, వాటర్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు మంచి మేలు చేస్తాయి. అందుకే  సొరకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 
 


మూత్రపిండాలకు ప్రయోజనకరం

సొరకాయలో సోడియం, పొటాషియం చాలా తక్కువగా ఉంటాయి.అందుకే ఇది మూత్రపిండాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. సొరకాయను తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఒత్తిడిని తగ్గిస్తుంది

ఇది కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ సొరకాయను తినడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. నిజానికి సొరకాయలో ఒక రకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఒత్తిడి తగ్గడం వల్ల మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు. దీంతో మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. 

click me!