ఇంట్లోనే అదిరిపోయే గోబీ మంచూరియా..!

First Published Feb 20, 2021, 11:40 AM IST

గోబీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే బయట మార్కెట్లలో కాకుండా ఇంట్లోనే చేసుకుని తింటే మంచిది.

గోబీ మంచూరియన్ తినడానికి ప్రతిఒక్కరు ఇష్టపడతారు. ఒక ప్రత్యేక రుచిని కలిగిన ఈ రిసిపీని కాలీఫ్లవర్’తో తయారుచేస్తారు. ఆ కాలీఫ్లవర్ డయాబెటిక్ టైప్ 2 (మధుమేహ) వ్యాధిని దూరం చేసే పోషకాలను కలిగి వుంటుంది. కాబట్టి.. గోబీ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే బయట మార్కెట్లలో కాకుండా ఇంట్లోనే చేసుకుని తింటే మంచిది. మరి దీనిని ఎలా చేస్తారో తెలుసుకుందామా...
undefined
కావాల్సిన పదార్ధాలు2 కప్పులు కాలీ ఫ్లవర్ తరుగు5 టీ స్పూన్స్ మైదా5 టీ స్పూన్స్ కార్న్ స్టార్చ్2 టీ స్పూన్స్ చిరుధాన్యాలు2 టీ స్పూన్స్ కెచప్ (పెద్దవి)2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్4 టీ స్పూన్స్ సోయాసాస్2 టీ స్పూన్స్ వైట్ వెనిగర్12 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్4 టీ స్పూన్స్ నీళ్లు12 కప్ ఉల్లిపాయ3 వెల్లుల్లిపాయలువంటకు సరిపడేంత నూనె (డీప్ ఫ్రై చేయడానికి)రుచికి తగినంత ఉప్పు14 కప్ పచ్చిమిర్చి
undefined
తయారు చేయు విధానంStep1ఒక నాన్’స్టిక్ పాత్రను తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిరెబ్బలు వేసి 5 నిముషాలపాటు ఉడికించాలి.
undefined
Step2ఉల్లిపాయలు బ్రౌన్ కలర్’లోకి వచ్చేంతవరకు వేడిచేసిన అనంతరం అందులో కెప్, రెడ్ చిల్లీ సాస్ వేసి.. నూనె పైకి తేలేవరకు ఫ్రై చేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత సోయాసాస్, వెనగర్ వేసి కలుపుకోవాలి.
undefined
Step3అనంతరం అందులోనే రెండు టీ స్పూన్ల కార్న్ స్టార్చ్, 4 టీ స్పూన్ల నీల్లు వేసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని కలియబెడుతూ ఐదు నిముషాలవరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడకబెట్టిన తర్వాత ఈ సాస్’ను పక్కన పెట్టుకోవాలి.
undefined
Step4మరోవైపు ఒక పాత్రలో మైదా, కార్న్ స్టార్చ్, బ్లాక్ పెప్పర్, రుచికి తగినంత ఉప్పు, నీళ్లు వేసి.. ఉండలు లేకుండా పిండిని తయారుచేసుకోవాలి. ఈ పిండిలోనే కాలీఫ్లవర్ తరుగును వేసి కలుపుకోవాలి.
undefined
Step5ఇప్పుడు ఒక పెనుము తీసుకుని అందులో కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు కలుపుకున్న పండిఫ్లవర్ మిశ్రమాన్ని వేసి.. డీఫ్ ఫ్రై చేసుకోవాలి.
undefined
Step6డీప్ ఫ్రై చేస్తుండగానే అందులో సాస్’ను యాడ్ చేసి మిక్స్ చేయాలి. తర్వాత మీడియం మంట మీద కొద్దిసేపటివరకు హీట్ చేయాలి. అసలు తేమ అనేది లేకుండా ఫ్రై చేసిన అనంతరం బయటికి తీసేయాలి. అంతే గోబి మంచూరియన్ రెడీ!
undefined
click me!