కిచెన్ లో చీమల బెడద.. పరిష్కార మార్గాలు ఇవే..

First Published | Apr 3, 2021, 12:18 PM IST

కర్పూరం వాసనకు కూడా చీమలు పారిపోతాయి.

ఇంట్లో ఏదైనా స్వీట్ చేద్దామని మొదలుపెడితే చాలు.. ఎక్కడి నుంచి వచ్చేస్తాయే.. చీమలు పుట్టుకువస్తాయి. కొంచెం కింద పడినా.. కాసేపటికే అక్కడ చీమల దండు తయారౌతుంది.
స్వీట్ అనే కాదు.. కిచెన్ లో ఏదైనా కొంచెం ఫుడ్ కింద పడినా.. పడకున్నా.. ఈ చీమల కారణంగా ఇబ్బందలుపడేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. దీనికి కొన్ని సహజ పద్ధతుల ద్వారా వాటిని పరిష్కరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పసుపు, కుంకుమ పువ్వులతో చీమలను తరిమికొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కొద్దిగా పసుపు కానీ.. కుంకుమ పువ్వు చల్లితే పరిష్కారం వెంటనే కనపడుతుంది.
అంతేకాదు.. కర్పూరం వాసనకు కూడా చీమలు పారిపోతాయి.
పెప్పరమింట్ ఆయిల్.. చీమలు ఎక్కువగా ఉన్న సమయంలో.. ఈ నూనెను పది చుక్కలు వేస్తే.. మళ్లీ ఆ దరిదాపుల్లో కనిపించవు.
పంచదార.. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. నల్ల చీమలను తరిమికొట్టేందుకు కొన్ని పంచదార పలుకులు వేసినా చాలట. మామూలుగా అయితే.. పంచదారకు ఆకర్షితులు అవుతాయి కదా అని మీరు అనుకోవచ్చు. నల్ల చీమలు మాత్రం పంచదార చల్లితే అక్కడి నుంచి పోతాయట.
ఒక కప్పు వెనిగర్ లో.. అంతే పరిమాణంలో నీటిని తీసుకొని రెండింటిని మిక్స్ చేయాలి. ఆ తర్వాత దానిని స్ప్రే చేయడం వల్ల చీమలు పారిపోతాయి.
నారింజ తొక్క.. చీమలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నారింజ తొక్కలను ఉంచినా.. అవి కనిపించకుండా పారిపోతాయి.

Latest Videos

click me!