పరగడుపున అరటి పండు తింటే.. ఇన్ని నష్టాలా..?

First Published Mar 31, 2021, 12:56 PM IST


ఎక్కువ మంది అరటిపండ్లు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువ న్యూట్రీషన్స్ ఉండటంతోపాటు.. తక్కువ ధరకే లభిస్తాయి అనే కారణంతో వీటిని ప్రిఫర్ చేస్తారు.

చాలా మందికి తొందరగా ఆకలి తీరుతుంది కదా అని అరటి పండ్లు తింటూ ఉంటారు. ఇంకొందరు ఉదయాన్నే కూడా వీటిని తింటూ ఉంటారు. అరటిలో అనేక న్యూట్రీషన్స్ ఉంటాయి నిజమే.. కానీ దానిని తీసుకునే విధానం సరిగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
undefined
మీరు ఆకలితో ఉన్నప్పుడు అరటిపండ్లు తినడం, ఉదయం లేవగానే పరగడుపున అరటి తినడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది
undefined
ఎక్కువ మంది అరటిపండ్లు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువ న్యూట్రీషన్స్ ఉండటంతోపాటు.. తక్కువ ధరకే లభిస్తాయి అనే కారణంతో వీటిని ప్రిఫర్ చేస్తారు.
undefined
చాలా మంది ఆకలితో ఉన్నప్పుడు, వారి ఆకలిని తీర్చడానికి వారు అరటిపండ్లు తింటారు. ఈ పండు తినడం వల్ల శరీరానికి పోషణ వస్తుంది. కానీ అదే సమయంలో అరటిని ఖాళీ కడుపుతో తినకూడదని గుర్తుంచుకోవాలి.
undefined
పరగడుపున తినడం వల్ల ఎక్కువ శక్తి వస్తుంది. అయితే.. దాని వల్ల వెంటనే నిద్ర వస్తుందట. బద్ధకం పెరిగి.. సోమరితనం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే పరగడుపున అరటి తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
undefined
అరటిపండ్లలో ఎసిటిక్ యాసిడ్ గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని డ్రై ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవాలి.
undefined
అరటిపండ్లను ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరంలో మెగ్నీషియం బ్యాలెన్స్ అదుపుతప్పుతుంది. ఫలితంగా, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. కానీ అరటిపండ్లు మాత్రమే కాదు, ఖాళీ కడుపుతో ఎటువంటి పండ్లను తినకూడదు.
undefined
click me!