మిగిలిపోయిన చపాతీలతో.. టేస్టీ శాండ్ విచ్ తయారీ..

First Published | Apr 1, 2021, 4:58 PM IST

మిగిలిపోయిన చపాతీలతో అద్భుతమైన స్నాక్ ఐటమ్ తయారు చేయచ్చు. చపాతీలు ఇష్టపడని వారు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అదే చపాతీ శాండ్ విచ్. మిగిలిపోయిన చపాతీలు, కూరగాయల ముక్కలు, మసాలాలు, సాస్ లు చేర్చి టేస్టీ టేస్టీ చపాతీ శాండ్ విచ్ తయారుచేయచ్చు. 

ఇది హెల్తీ కూడా. ఒకవేళ మీరు డైటింగ్ చేస్తున్నట్లైతే చీజ్ బదులు డైట్ మయోనైజ్ వాడొచ్చు. మీ ఇంట్లో, మీకు అందుబాటులో ఉన్న కూరగాయలను బట్టి దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పినవే కాకుండా మీకు నచ్చే రుచులను యాడ్ చేసుకుని చపాతీ శాండ్ విచ్ ను మరింత రుచికరంగా మార్చేసుకోవచ్చు.

చపాతీ శాండ్‌విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు :4 గ్రాముల చపాతీలు14 కప్పు మొక్కజొన్న12 కప్పు క్యాబేజీ12 టీస్పూన్ మామిడి కాయ పొడి1 టీస్పూన్ కారం పొడి2 టేబుల్ స్పూన్ మయోనైజ్2 టీస్పూన్ల వెన్న12 కప్పు ఉల్లిపాయ12 కప్పు క్యాప్సికమ్ లేదా పచ్చి మిరియాలు1 టేబుల్ స్పూన్ వెజిటెబుల్ ఆయిల్12 టీస్పూన్ కొత్తిమీర పొడి2 టేబుల్ స్పూన్ టమోటా కెచప్4 ముక్కలు చీజ్ క్యూబ్స్రుచికి తగినంత ఉప్పు
చపాతీ శాండ్‌విచ్ తయారు చేసే విధానం..మొదట ఓ బాణలిలో నూనె వేడి చేయండి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, కార్న్ వేసి బాగా కలపండి. కొద్ది నిమిషాలు వాటిని వేగనివ్వండి.
ఇప్పుడు మామిడికాయ ఎండుపొడి, కొత్తిమీర పొడి, కారం, ఉప్పు వేసి కలపండి. ఈ మిశ్రమం బాగా పొడిగా అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు కలపండి. చివరగా క్యాబేజీ వేసి, మరో రెండు నిమిషాలు ఉడికించి, మంటను ఆపేయండి.
ఇప్పుడు ఈ కూరగాయల మిశ్రమంలో టమోటా కెచప్, మయోనైజ్ వేసి బాగా స్మూత్ గా అయ్యాలా కలపాలి.
ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని దీనికి సగం వరకు ఈ మిశ్రమాన్ని పెట్టండి. ఆ తరువాత దీని మీద తురిమిన ఛీజ్ వేసి చపాతీని సగానికి మడవండి.
ఇప్పుడు ఒక చపాతీ తీసుకుని దీనికి సగం వరకు ఈ మిశ్రమాన్ని పెట్టండి. ఆ తరువాత దీని మీద తురిమిన ఛీజ్ వేసి చపాతీని సగానికి మడవండి.
ఇలా తయారైన ఈ శాండ్ విచ్ ను ఓ బాణలిలో కొంచెం వెన్న వేడిచేసి దాంట్లో వేయించండి. బంగారు గోధుమ రంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చాలి.
ఆ తరువాత స్టౌ మీదినుంచి దించిన మధ్యలోకి కట్ చేసుకుంటే చపాతీ శాండ్ విచ్ రెడీ అయినట్టే. టేస్టీలో అదుర్స్ అంటూ లొట్టలేసుకుంటూ తినేయడమే.
ఆ తరువాత స్టౌ మీదినుంచి దించిన మధ్యలోకి కట్ చేసుకుంటే చపాతీ శాండ్ విచ్ రెడీ అయినట్టే. టేస్టీలో అదుర్స్ అంటూ లొట్టలేసుకుంటూ తినేయడమే.

Latest Videos

click me!