మనం కామన్ గా చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లలో ఇడ్లీ ముందు వరసలో ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఇడ్లీలను ఇష్టంగా తింటూ ఉంటారు. ఇది తినడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సులభంగా జీర్ణం కూాడా అవుతుంది. ఇడ్లీలను మనం ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఇడ్లీ పిండి కూడా తయారు చేసుకుంటాం.
అయితే….మనం ఇంట్లో చేసుకునే ఇడ్లీ పిండి ఒక్కోసారి తొందరగా పులిసిపోతుంది. నిజానికి పిండి కాస్త పులిసిన తర్వాతే ఇడ్లీలు రుచిగా ఉంటాయి. కానీ.. మరీ ఎక్కువ పులిసిపోతే.. పిండి పుల్లగా మారుతుంది. ఇడ్లీ మాత్రమే కాదు దోశ పిండి కూడా పుల్లగా మారితే కూడా రుచిగా ఉండదు. ఇలాంటి పిండిని వాడలేం. అలా అని పారేయడానికి మనసు ఒప్పదు. కానీ, ఇదే పిండిని మళ్లీ ఫ్రెష్ గా మార్చుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇడ్లీ పిండి మాత్రమే కాదు..దోశ పిండి పులిసిపోయినా కూడా మనం కొన్ని రెమిడీలు ఫాలో అవ్వడం వల్ల.. ఆ పిండి ని మళ్లీ తాజాగా చేయవచ్చు. దానికోసం.. పిండిలో ఒక స్పూన్ పంచదార లేదంటే.. కొద్దిగా బెల్లం కలిపితే చాలు. ఇలా చేయడం వల్ల పిండిలో పులుపుదనం తగ్గడం మాత్రమే కాదు.. పిండికి రుచిని కూడా పెంచుతుంది. అలా అని మరీ ఎక్కువ కలిపితే పిండి మరింత వరస్ట్ గా మారుతుంది. కాబట్టి.. ఆ పొరపాట్లు చేయకూడదు.
మీరు బియ్యాన్ని కాసేపు నానపెట్టి.. దానిని రుబ్బి.. ఈ పిండిలో కలపడం వల్ల కూడా.. పిండిని మళ్లీ తాజాగా మార్చవచ్చు. ఇడ్లీ పిండి ఫ్రెష్ గా మారుతుంది. అదే దోశ పిండి కోసం అయితే.. మీరు రవ్వ కలపొచ్చు. దీని వల్ల పులుపు తగ్గడమే కాదు.. దోశలు చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. రుచి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది.
పిండి బాగా పులిసిపోయినప్పుడు మీరు పెప్పర్ కలపొచ్చు. లేదంటే.. ఉల్లిపాయ, క్యారెట్ లాంటివి మిక్స్ చేసి ఉతప్పం లేదంటే.. పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. ఇవి మరింత రుచిగా ఉంటాయి.