బాదం, జీడిపప్పు కాదు.. టైగర్ నట్స్ ను ఎప్పుడైనా తిన్నారా? ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా

First Published | Sep 9, 2024, 7:05 AM IST

మనకు తెలిసిన నట్స్.. బాదం, వాల్ నట్స్, కిస్ మిస్, జీడిపప్పులు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రోజూ తింటుంటాం. కానీ వీటికంటే టైగర్ నట్స్ మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాహారం తినాలి. ముఖ్యంగా నట్స్ ను మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో మన శరీరానికి అవసరమైన ఖనిజాలతో పాటుగా మంచి కొవ్వు కూడా పుష్కలంగా ఉంటుంది.

అయితే మీరు ఇప్పటి వరకు జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పిస్తా పప్పులనే తిని ఉంటారు. కానీ ఈ గింజలన్నింటి కంటే టైగర్ నట్స్ మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకంరగా ఉంటాయి. అవును వీటిని తింటే మీ శరీరానికి అన్ని రకాల మినరల్స్ అందుతాయి.
 

tiger nuts


టైగర్ నట్స్ అంటే ఏంటి?

టైగర్ నట్స్ అంటే టైగర్ లకు వీటికి ఏదో సంబంధం ఉంది అనుకోకుండి. వీటికి టైగర్ కు ఎలాంటి సంబంధం లేదు. మరి వీటికి ఆ పేరు ఎలా వచ్చిందంటే.. ఈ నట్స్ పైన పులికి ఉండే చారలు ఉంటాయి. అందుకే వీటిని టైగర్ నట్స్ అనే పేరుతో ఎక్కువగా పిలుస్తారు.

దీనితో పాటుగా టైగర్ నట్స్ ను నట్ గ్రాస్, ఎర్త్ ఆల్మండ్, ఎల్లో నట్స్ అంటు చాలా పేర్లతో పిలుస్తారు. ఇవి వేరుశెనగ, బంగాళాదుంపల లాగ పెరుగుతాయి. కానీ ఈ టైగర్ నట్స్ ను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 
 


టైగర్ నట్స్ ఉండే పోషకాలు 

టైగర్ నట్స్ లో 120 కేలరీలతో పాటుగా 19 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. 7 గ్రాముల కొవ్వు, పుష్కలంగా మంచి మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది.

అలాగే కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ తో పాటుగా 10 గ్రాముల ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఈ గింజలను తింటే మన శరీరానికి అవసరమైన అన్ని రకాల మినరల్స్ అందుతాయి. అలాగే వీటిలో విటమిన్ సి,విటమిన్ డి, విటమిన్ ఇ లు కూడా ఉంటాయి.


టైగర్ నట్స్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

మెరుగైన జీర్ణక్రియ

టైగర్ నట్స్ లో కరగని డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కడుపులో జీర్ణంకాని ఆహారాన్ని సులభంగా అరగడానికి సహాయపడుతుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. అలాగే దీనిలో ఉండే ఫైబర్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. 

బ్లడ్ షుగర్ కంట్రోల్
 
టైగర్ నట్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ బ్లడ్ షుగర్ పెరగకుండా చూస్తుంది. ఈ ఫైబర్ గట్ లో చక్కెర శోషణను నిరోధిస్తుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే దీనిలో అర్జినిన్ అమైనో ఆమ్లం కూడా ఉంటుంది. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది.

బలమైన ఎముకలు 

టైగర్ నట్స్ లో ప్రోటీన్ 18 అమైనో ఆమ్లాలు మెండుగా ఉంటాయి. ఇది  మొక్కల ఆధారిత ప్రోటీన్ కు మూలం. అంటే ఇది మీకు గుడ్డుతో సమానమైన ప్రోటీన్ ను అందిస్తుంది. వీటిని తింటే మీ ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. 

ఆరోగ్యకరమైన గుండె

టైగర్ నట్స్ లో మోనోశాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.


యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి

యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఇ లు పుష్కలంగా ఉంటే టైగర్ నుట్స్ ను తింటే కణాల నష్టం తగ్గుతుంది. ఇవి ఒక రక్షణ పొరలా పనిచేస్తాయి. వీటిని తింటే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

Latest Videos

click me!