ఇడ్లీలు సాఫ్ట్ గా, మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలుసా?

First Published | Sep 8, 2024, 11:41 AM IST

ఇడ్లీలను వారంలో ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా ఇంట్లో చేస్తుంటారు.  కానీ ఇంట్లో చేసిన ఇడ్లీలు హోటల్ స్టైల్ లో అంటే సాఫ్ట్ గా, మెత్తగా రావు. గట్టిగా, ఎలాగో వస్తుంటాయి. హోటల్ స్టైల్ లో ఇడ్లీలు రావాలంటే ఏం చేయాలో తెలుసా?

సౌత్ ఇండియన్ వంటకాలను ఇష్టపడేవారు ఖచ్చితంగా ఇడ్లీలను తింటుంటారు. వారంలో ఒకటి రెండు మూడు సార్లైనా ఇడ్లీలను ప్రిపేర్ చేసేవారున్నారు. ఇడ్లీలు బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ కు చాలా బాగుంటాయి.

అయితే హోటల్ , రెస్టారెంట్  లో ఉండే ఇడ్లీలు చాలా మెత్తగా, సాఫ్ట్ గా ఉంటాయి. కానీ ఇంట్లో మనం ప్రిపేర్ చేసే ఇడ్లీలు మాత్రం గట్టిగా, అదో రకంగా వస్తుంటాయి. కానీ కొన్ని చిట్కాలను ఫాలో అయితే మీరు తయారుచేసే ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

1. మెత్తని, సాఫ్ట్ ఇడ్లీని తయారుచేయడానికి బాస్మతి బియ్యాన్ని పొరపాటున కూడా ఉపయోగించకూడదు. కొంతమంది బాస్మతి బియ్యాన్ని కూడా ఇడ్లీకి ఉపయోగిస్తుంటారు. కానీ దీనివల్ల ఇడ్లీలు సరిగ్గా రావు.

పర్ఫెక్ట్ ఇడ్లీలు తయారుచేయాలంటే  మీరు ఇడ్లీ రైస్ లేదా పార్బాయిల్డ్ రైస్ నే వాడాలి. లేదా మీడియం లేదా స్మాల్ గ్రెయిన్ రైస్ పిండిని కూడా ఇడ్లీకోసం ఉపయోగించొచ్చు. వీటివల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. 

2) ఇడ్లీ పిండిని తయారు చేసేటప్పుడు బియ్యం, కడిగిన మినప్పప్పు క్వాంటిటీపై శ్రద్ధ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రతి రెండు కప్పుల అన్నానికి ఒక కప్పు కాయధాన్యాలను వాడండి. ఇడ్లీలు మెత్తగా, సాఫ్ట్ గా రావాలంటే ఎప్పుడూ కూడా తాజా పప్పునే వాడండి.


3) నానబెట్టిన బియ్యాన్ని గ్రైండ్ చేయడానికి  ఫుడ్ ప్రాసెసర్ ను ఉపయోగించకండి. వీటికి గ్రైండర్ ను ఉపయోగించండి. పప్పులు, బియ్యాన్ని గ్రైండ్ చేయడానికి పిండిలో కొద్దిగా కూల్ వాటర్ ను కలపండి.

అలాగే పిండిని గ్రైండ్ చేసేటప్పుడు మిశ్రమం వేడెక్కకుండా చల్ల నీటిని ఉపయోగించండి. ఈ పిండి చల్లగా లేదా గది ఉష్ణోగ్రత వద్దే ఉండాలి. 

4. ఇడ్లీలు మెత్తగా రావడానికి మెంతులు బాగా సహాయపడతాయి. కాబట్టి ఒకటిన్నర నుంచి రెండు టీస్పూన్ల మెంతులను బియ్యం, పప్పులతో పాటుగా నానబెట్టి గ్రైండ్ చేసుకోండి. మెంతుల వల్ల ఇడ్లీలు మెత్తగా మారడమే కాకుండా రుచి కూడా బాగుంటుంది. 

5. మీరు ప్రిపేర్ చేసే ఇడ్లీలు మెత్తగా రావడానికి పప్పు, బియ్యం గ్రైండ్ చేసిన తర్వాత మీ చేతులతో ఐదు నిమిషాల పాటు ఈ రెండింటిని బీట్ చేయండి. ఆ తర్వాత మూతపెట్టి పులియబెట్టండి.

ఇలా కలపడం వల్ల ఆ పిండిలోకి అందులోకి తగినంత గాలి వెళ్తుంది. ఇది ఇడ్లీలను మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. కిణ్వ ప్రక్రియ కోసం ప్లాస్టిక్ లేదా గాలి చొరబడని పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు. 
 

ఇడ్లీలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పులియబెట్టిన ఇడ్లీలను గానీ దోశలను గాని తినడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవారు వీటిని తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి మిమ్మల్ని ఎన్నో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. 
 

అలాగే ఇడ్లీలను తింటే ఊబకాయం, అధిక బరువు కూడా తగ్గుతారు. ఇవి మీరు బరువు తగ్గడానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇడ్లీలు ఆవిరిలోనే ఉడికపోతాయి.

వీటిని తినడం వల్ల మనకు వచ్చే సమస్యలేమీ ఉండవు. వీటిని తింటే మన కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అలాగే అతిగా తినలేరు. అంటే ఇవి మీరు ఆరోగ్యంగ బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

మీకు తెలుసా? పులియబెట్టిన ఇడ్లీలను తినడం వల్ల మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. ఇడ్లీలు చాలా తొందరగా జీర్ణమవుతాయి. అలాగే ఇవి మీ శరీరంలో ఫ్యాట్ ను తగ్గిస్తాయి. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!