ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే.. వారి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

First Published Apr 5, 2021, 11:38 AM IST

ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ తాగేవారిలో మెదడు పనితీరు చురుకుగా ఉంటుందని తేలింది. అంతేకాకుండా.. రక్త నాళాలను మంచి స్థితిలో ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. 

ఆరోగ్యకరమైన జీవితాన్ని అందరూ కోరుకుంటారు. కానీ అలాంటి ఆరోగ్యకరమైన జీవితం దక్కాలంటే.. కొంత కష్టపడాల్సిందే. వ్యాయామం మనిషికి ఎంత అవసరమో... ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా అంతే అవసరం. ఆ విషయంలో బీట్ రూట్ ముందు వరసలో ఉంటుంది
undefined
ఇటీవల చేసిన ఓ పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ బీట్ రూట్ జ్యూస్ తాగేవారిలో మెదడు పనితీరు చురుకుగా ఉంటుందని తేలింది. అంతేకాకుండా.. రక్త నాళాలను మంచి స్థితిలో ఉంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా అసలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం..
undefined
ఎక్సెటర్ విశ్వవిద్యాలయం చేసిన కొత్త అధ్యయనంలో బీట్ రూట్ వల్ల కలిగే అద్భుతాలు వెలుగులోకి వచ్చాయి. వాళ్లు తమ పరిశోధనలో 26 మంది ఆరోగ్యకరమైన వృద్ధులు పాల్గొన్నారు. వీరికి బీట్రూట్ జ్యూస్ ని అందించారు. అది ఒకటి నైట్రేట్ కలిపిన జ్యూస్ అయితే. మరొకరటి నైట్రేట్ లేని సాధారణ జ్యూస్ ఇచ్చారు.
undefined
ఆ తర్వాత బీట్రూట్ జ్యూస్ తాగినవారిలో ఎలాంటి ప్రయోజనాలు చేకూరాయో కూడా పరిశీలించారు. బీట్రూట్ జ్యూస్ తాగినవారిలో మెదడు పనితీరు పెరిగినట్లు గుర్తించారు.
undefined
బీట్రూట్ , పాలకూర, బచ్చలికూర, సెలెరీతో సహా ఇతర ఆహారాలు అకర్బన నైట్రేట్, అనేక నోటి బ్యాక్టీరియాతో సమృద్ధిగా ఉంటాయి.
undefined
ఈ రెండూ కలిపి నైట్రేట్‌ను నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి, ఇది రక్త నాళాలు మరియు న్యూరోట్రాన్స్‌మిషన్ (మెదడులోని రసాయన సందేశాలు) ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
undefined
వృద్ధులు తక్కువ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని కలిగి ఉంటారు. కాబట్టి వారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది.
undefined
click me!