ప్రసాదంగా రవ్వ కేసరి... నిమిషాల్లో తయారీ..!

First Published | Feb 16, 2021, 2:03 PM IST

నేడు వసంత పంచమి. ఈ సందర్భంగా.. సరస్వతీ దేవి అమ్మవారికి ఈ స్వీట్ ని ప్రసాదంగా పెట్టుకోవచ్చు.

రవ్వ కేసరి... ఈ స్వీట్ చాలా మంది ఫేవరేట్. దాదాపు చాలా మంది అమ్మవారికి ప్రసాదంగా ఈ స్వీట్ ని తయారు చేస్తారు. చాలా తక్కువ పదార్థాలతో.. సులువుగా తయారు చేసే స్వీట్స్ లో ఇది కూడా ఒకటి.
నేడు వసంత పంచమి. ఈ సందర్భంగా.. సరస్వతీ దేవి అమ్మవారికి ఈ స్వీట్ ని ప్రసాదంగా పెట్టుకోవచ్చు. మరి దీనిని అత్యంత సులువుగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు..200 గ్రాముల రవ్వ, 1 కప్పు పంచదార, 200 గ్రాముల జీడిపప్పు, 2 చిటికెల సాఫ్రాన్, 3 లవంగాలు, 200 గ్రాముల నెయ్యి, 20 గ్రాముల ఎండు ద్రాక్ష, 75గ్రాముల పైనాపిల్,3 నల్ల యాలకులు, ఒకటిన్నర కప్పు మంచినీరు.
తయారీ విధానం..1. ముందుగా మందపాటి ప్యాన్ తీసుకోవాలి. దానిని మీడియం మంట పై పెట్టి దాంట్లో నెయ్యి వేయాలి.
2. ఆ నూనెలో జీడిపప్పు, లవంగాలు వేసి కొద్దిగా వేయించాలి. ఆ తర్వాత అందులో రవ్వ వేసి కొద్దిగా వేయించాలి.
3. ఈ వేయించిన రవ్వలో వాటర్, పంచదార, పైనాపిల్ ముక్కలు, యాలకుల పొడి , ఎండు ద్రాక్ష వేసి బాగా కలపాలి.
4. దాంట్లోనే సాఫ్రాన్ కూడా వేయాలి. అది ఎరుపు రంగులోకి మార్చుతుంది.
5. అంతే.. గుమగుమలాడే రవ్వ కేసరీ రెడీ.. దీనిలో నీళ్లు కొద్దిగా తగ్గించి.. దానికి బదులు పాలు కూడా పోసుకోవాలి. అలా చేసినా కూడా రుచి చాలా బాగుంటుంది.

Latest Videos

click me!