నడుం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించే తారకమంత్రం ఇదే...

First Published | Oct 5, 2020, 1:43 PM IST

మారుతున్న జీవనశైలి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇందులో ముఖ్యమైంది ఒబేసిటీ. అయితే దీన్నుండి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. 

మారుతున్న జీవనశైలి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఇందులో ముఖ్యమైంది ఒబేసిటీ. అయితే దీన్నుండి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.
undefined
బరువు తగ్గాలంటే ప్రోటీన్ ఎక్కువ, క్యాలరీలు, కార్బోహైడ్రేట్ లు తక్కువున్న ఆహారం తీసుకోవడం ముఖ్యం. దీనికి సరైన ఉదాహరణ గుడ్లు. శరీరానికి ప్రోటీన్ అందించే బెస్ట్ సోర్స్ కోడిగుడ్లు. అందుకే రోజుకు కనీసం ఒక గుడ్డు అయినా తినాలి.
undefined

Latest Videos


బరువు తగ్గడానికి, అధిక ప్రోటీన్, తక్కువ కేలరీలు, తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి ప్రోటీన్ అందించే బెస్ట్ సోర్స్ లో గుడ్లు ముఖ్యమైనవి. రోజుకు కనీసం ఒక గుడ్డైనా ఆహారంలో చేర్చాలి. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. డైట్ చేసేవారికి అవసరమైన శక్తిని ఇస్తుంది. గుడ్లలో అమైనో ఆమ్లాలు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.
undefined
బరువు తగ్గాలనుకునేవారు మీ ఆహారంలో ఆకు కూరలను పుష్కలంగ చేర్చాలి. ఆకు కూరలలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఆకుకూరల్లో విటమిన్ ఎ, కె, ఐరన్ పుష్కలంగా దొరుకుతాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆకు కూరగాయలు నడుం దగ్గర పేరుకున్న కొవ్వు తగ్గడానికి, బరువు తగ్గడానికి సహాయపడతాయి. భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా చేర్చడం వల్ల ఆకలిని నియంత్రిస్తుంది.
undefined
డైటింగ్ చేసేవాళ్లు తప్పనిసరిగా ఆహారంలో బాదాంలాంటి నట్స్ ని చేర్చాలి. బాదాంలు ఎంతో మంచివి. ఇవి బరువు తగ్గించడంలో చాలా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే బాదంలు నానబెట్టి తినడం వల్ల మాత్రమే చాలా ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.
undefined
ఓట్స్ లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఓట్స్ తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ చేయడంలో బాగా తోడ్పడతాయి.
undefined
విటమిన్ల బాంఢాగారం లెగ్యూమ్స్. వీటిల్లో ప్రోటీన్లు, మినర్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల ఆకలిని నియంత్రించి ఓబేసిటీని తగ్గిస్తుంది.
undefined
click me!