షుగర్ పేషెంట్స్ అసలు తినకూడని ఆహారం ఇదే!

First Published | Sep 17, 2020, 12:44 PM IST

సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ పిండి పదార్ధాలు, తక్కువ శక్తితో కూడిన  పోషకమైన ఆహారం తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల జోలికి మాత్రం అస్సలు వెళ్లకూడదు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

డయాబెటిస్ సోకిన వారు ఏదైనా ఆహారం తినాలంటే చాలా సందేహిస్తారు. నిజానికి ఆలోచించాలి కూడా. ఎందుకంటే.. వాళ్లు ఏ ఆహారం పడితే అది తినకూడదు. ఒకవేళ తింటే.. లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు కచ్చితంగా డయాబెటిక్ డైట్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
డయాబెటిక్ డైట్ అంటే ఏమిటనే దానిపై చాలామందికి సందేహాలు ఉంటాయి. సాధారణంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ పిండి పదార్ధాలు, తక్కువ శక్తితో కూడిన పోషకమైన ఆహారం తీసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాల జోలికి మాత్రం అస్సలు వెళ్లకూడదు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

షుగర్ పేషెంట్స్ తినకూడని ఆహారాల జాబితాలో వైట్ బ్రెడ్ అగ్రస్థానంలో ఉంది. ఇవి అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వైట్ బ్రెడ్ డైట్ జోలికి వెళ్లకపోవడం మంచిది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు నూనేలో వేయించిన ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటిలో కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కూడా కారణమవుతాయి. శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఇది ఇన్సులిన్ నిరోధకత మరియు మధుమేహానికి దారితీస్తుంది.
కూల్ డ్రింక్స్, సోడాలాంటివి కూడా తీసుకోవడం మంచిది కాదు. వీటిలో తీపి పదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఆర్టిఫీషియల్ స్వీట్నర్స్ కి కూడా దూరంగా ఉండాలి.
జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన పొట్ట దగ్గర కొవ్వు త్వరగా పేరుకుపోతుంది.
పండ్లు తీసుకునే సమయంలోనూ వీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని పండ్లు తినడానికి వీలు లేదు. మరీ ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ అస్సలు తాగకూడదు. దీంట్లో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి.

Latest Videos

click me!