ఈ పండ్లు ఎముకల బలాన్ని పెంచి.. రోగాలను దూరం చేస్తాయి

First Published May 18, 2023, 4:22 PM IST

ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, బలంగా ఉండేందుకు మన శరీరానికి కాల్షియం చాలా అవసరం. కాల్షియం ఎక్కువగా ఉండే పండ్లను తిన్నా ఎన్నో ఎముకలకు సంబంధించిన  సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

fruits

క్యాల్షియం లోపం వల్ల శరీరంలోని ఎముకలన్నీ బలహీనపడతాయి. అంతేకాదు దీనివల్ల ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధి  కూడా వస్తుంది. అలాగే మీ ఎముక సాంద్రత తగ్గుతుంది. మీరు నెమ్మదిగా ఎన్నో వ్యాధులకు గురవుతారు. ఇలాంటి పరిస్థితిలో మీరు కాల్షియం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. ఇవి మీ ఎముకలకు వివిధ మార్గాల్లో ప్రయోజనకరంగా ఉంటాయి. అవేంటంటే.. 

orange

నారింజ

నారింజ పండ్లలో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల నారింజలో 40 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల మీ శరీరంలో కాల్షియం లోపం ఉండదు. దీనితో పాటుగా ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది కాల్షియం శోషణను పెంచుతుంది. అలాగే ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
 

kiwi

కివి

34 గ్రాముల కివిలో 100 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. అంటే రోజూ 2 కివీస్ తింటే మీ శరీరానికి మంచి కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకల సాంద్రతను పెంచి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనితో పాటుగా ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది మిమ్మల్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతుంది.

నేరేడు పండ్లు

నేరేడు పండ్లలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మీరు కొన్ని నేరేడు పండ్లను మాత్రమే తిన్నా సుమారు 162 మి.గ్రా కాల్షియాన్ని పొందుతారు. ఇది మీ ఎముకలకు ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు దీనిని తినడం వల్ల మీ శరీరానికి ఇనుము, మెగ్నీషియం కూడా లభిస్తుంది.
 

papaya

బొప్పాయి

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఎముకల ఆరోగ్యానికి దీన్ని తినడం వల్ల చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ పరిమాణం కేవలం 24 గ్రాములు మాత్రమే అయినప్పటికీ రోజూ ఇంత తినడం కూడా సరిపోతుంది. అంతేకాకుండా ఇది మీ కడుపు, చర్మానికి సంబంధించిన ఎన్నో  సమస్యలను తొలగిస్తుంది.
 

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలను తినడం వల్ల శరీరంలో విటమిన్ సి, కాల్షియం పరిమాణం పెరుగుతుంది. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో సుమారు 27 మి.గ్రా కాల్షియం ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాల్షియం లోపం పోతుంది. అందుకే కాల్షియం లోపం ఉన్నవారు మీ డైట్ లో ఈ పండ్లను ఖచ్చితంగా చేర్చండి. 
 

click me!