dry fruits
డ్రై ఫ్రూట్స్ ను తింటే ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని మనం చిన్నప్పటి నుంచే వింటున్నాం. అందుకే చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను రోజూ తింటుంటారు. రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ ను తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో మనం ఎన్నో జబ్బులకు దూరంగా ఉంటాం. అయితే డ్రై ఫ్రూట్స్ వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలిగినా కొంతమంది మాత్రం వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
diabetes
షుగర్ పేషెంట్లు తినకూడదు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. షుగర్ పేషెంట్లు డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు. ఎందుకంటే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరిగిపోతాయి. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే డయాబెటీస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే డ్రై ఫ్రూట్స్ ను తింటే షుగర్ పేషెంట్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
బరువు తగ్గే వ్యక్తులు
బరువు తగ్గాలనుకునే వారు కూడా డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. అందుకే బరువు తగ్గాలనుకుంటే వీటిని తినకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. బరువు పెరగడానికి ఇవే ప్రధాన వనరు. వీటిని తింటే మీరు బరువు పెరగడం పక్కాగా జరుగుతుంది.
కడుపు సమస్యలు ఉంటే అస్సలు తినకూడదు
కడుపునకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కూడా డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. ఎందుకంటే ఫైబర్ ను మోతాదుకు మించి తీసుకుంటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కొన్ని కొన్నిసార్లు మీ కడుపు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అందుకే కడుపునకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ ను తినకూడదు.
అలెర్జీలు ఉన్నవారికి మంచిది కాదు
డ్రై ఫ్రూట్స్ కు అలెర్జీ ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటివల్ల అలెర్జీ వస్తుంది. వీళ్లతో పాటుగా గర్భిణులు కూడా డ్రై ఫ్రూట్స్ ను ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ లో గర్భధారణ సమయంలో హాని కలిగించే కొన్ని పోషకాలుంటాయి.
ముఖానికి సంబంధించిన సమస్యలు ఉన్న వారు
అలెర్జీల వల్ల చాలా మందికి ముఖంపై ఎన్నో రకాల చర్మ సమస్యలు వస్తుంటాయి. మీకు తెలుసా? డ్రై ఫ్రూట్స్ వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే వీటిని ఎక్కువగా తింటే గనుక ముఖంపై మొటిమలు అవుతాయి. అలాగే చర్మంపై దురద పెట్టడం వంటి సమస్యలు వస్తాయి. అందు స్కిన్ అలర్జీ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ ను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.