వేడి వేడిగా పొగలు కక్కుతూ.. కమ్మని గుమగుమలాడే నురగలు కక్కే కాఫీ.. తాగితే వచ్చే కిక్కేవారు. మనలో చాలా మందికి .. ప్రతిరోజూ ఉదయాన్నే కప్పు కాఫీ తాగనిదే తెల్లారదు. ఆ కాఫీ తాగిన తర్వాత ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు మంచి ఫీల్ ఇచ్చిన కాఫీ ఇప్పుడు .. మనల్ని కరోనా లాంటి మహమ్మారి నుంచి కూడా కాపేడుస్తోందట.
ఇప్పటి వరకు ప్రతిరోజూ కాఫీ తాగితే.. లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి అని మాత్రమే మనకు తెలుసు. అయితే.. ఇక నుంచి కాఫీ తాగితే కరోనా మహమ్మారి కూడా జోలికి రాదట. ఈ విషయం ఇటీవల చేసిన ఓ పరిశోధనలో తేలింది.
ప్రతిరోజూ కాఫీ తాగే వారిలో.. కరోనా వచ్చే అవకాశం 10 శాతం తక్కువగా ఉంటుందట. నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది.
అంతేకాదు.. కాఫీ తాగే వారిలో.. న్యూమోనియా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుందట. అదేవిధంగా.. కాఫీ తాగేవారిలో రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందట. దీంతో... వైరస్ లపై పోరాడుతుంది.
దాదాపు 40వేల మందిపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. కాఫీ తాగడంతోపాటు... చేప, మాంసాహారం, కూరగాయలు, పండ్లు తినేవారు కరోనాతో సులభంగా పోరాడగలుగుతారట.
ప్రతిరోజూ కూరగాయలు, పండ్లు తినేవారిలో సైతం కరోనాను పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది.