తందూరీ ఎగ్ మంచి రుచికరమైన వంటకం... దీన్ని బిర్యానీతో కలిసి తినొచ్చు. మసాలా ఎగ్స్ లా కూడా తినొచ్చు. కెచప్ లతో తినొచ్చు, చేయాల్సిందల్లా..ఎగ్స్ ఉడకబెట్టడం, వాటిని మేరినేట్ చేసి.. గ్రిల్ చేయడమే..
వీటిని పెరుగుతో కలిపిన మసాలాతో కోటింగ్ చేయడం వల్ల దీని రుచి మరింత పెరుగుతుంది.
తందూరీ ఎగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు4 ఉడకబెట్టిన గుడ్డురుచికి తగినంత ఉప్పు12 టీస్పూన్ కారం1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం12 టీస్పూన్ చాట్ మసాలా
4 టేబుల్ స్పూన్లు పెరుగు1 టీస్పూన్ తందూరి మసాలా2 టేబుల్ స్పూన్ల శనగ పిండి1 టేబుల్ స్పూన్ ఆవ నూనె2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర
తందూరీ ఎగ్ తయారు చేసే విధానం..ముందుగా ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, నిమ్మరసం, కారం, తందూరి మసాలా ఉప్పు వేసి బాగా కలపండి.
తర్వాత ఉడికించిన గుడ్లను సగం లేదా నాలుగు భాగాలుగా కట్ చేసి ముందు తయారు చేసుకున్న మసాలా మిశ్రమంతో కోటింగ్ చేయండి.
ఇక ఇప్పుడు తందూరీ లేదా గ్రిల్ పాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆవాల నూనె వేడి చేయాలి. ఇప్పుడు పాన్లో మెరినేట్ చేసిన గుడ్లు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించాలి.
ఓవెన్లో చేయాలనుకుంటే 180 డిగ్రీల సి వద్ద 10 నిమిషాలపాటు గుడ్లను గ్రిల్ చేయవచ్చు.
అంతే తందూరీ ఎగ్స్ రెడీ.. వీటిని కొంచెం చాట్ మసాలా చల్లి, పైన కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చేయడమే.