మల్టీ విటమిన్లు తీసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

Published : Jan 23, 2025, 12:08 PM IST

సప్లిమెంట్స్ అంటే.. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు ఆహారం రూపంలో మనకు పూర్తి స్థాయిలో లభించకపోతే... వాటిని ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటారు.

PREV
16
మల్టీ విటమిన్లు తీసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?

తమ ప్రాణం మీద తీపి లేని మనిషి ఎవరైనా ఉంటారా?  దాదాపు ప్రతి ఒక్కరూ తాము ఎక్కువ కాలం జీవించాలని, అది కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఆరోగ్యం మాత్రమే కాదు అందంపై కూడా శ్రద్ధ చాలా మందికి ఉంటుంది. తమ ఏజ్ నెంబర్ పెరిగినా.. తాము మాత్రం చిన్న వారిలా, యవ్వనంగా కనిపించాలనే అనుకుంటూ ఉంటారు. దాని కోసం ఎవరికి తెలిసిన ప్రయత్నాలు వాళ్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విటమిన్లు తీసుకుంటూ ఉంటారు. విటమిన్లు మనకు ఆహారంలో లభిస్తాయి. అలా కాదు అంటే... వాటిని సప్లిమెంట్ల రూపంలో తీసుకోవాలి. ఇది మంచిదే. కానీ.... మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలి అంటే కొన్ని విటమిన్ ల సప్లిమెంట్స్ ని మాత్రం ఎక్కువగా తీసుకోకూడదట. వేటిని ఎక్కువగా తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...

26
Multivitamins

సప్లిమెంట్స్ అంటే.. మన శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు ఆహారం రూపంలో మనకు పూర్తి స్థాయిలో లభించకపోతే... వాటిని ట్యాబ్లెట్ల రూపంలో తీసుకుంటారు. వాటినే సప్లిమెంట్స్ అంటారు. ఈ మధ్యకాలంలో పౌడర్ల రూపంలో కూడా అందుబాటులో ఉంటున్నాయి. అయితే.. వీటిలో కొన్ని మనకు ఎంత మంచివి అయినా ఎక్కువ మాత్రం తీసుకోకూడదట. 

36
iron supplements

1.ఐరన్...

మన శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఐరన్ లేకపోతే మనకు చాలా నీరసంగా ఉంటుంది. శరీరంలో ఆక్సీజన్ రవాణా చేయడంలో దీని పాత్ర చాలా ఎక్కువ. ఐరన్ తక్కువగా ఉంటే.. మీట్, పౌల్ట్రీ ఆహారం తీసుకుంటూ ఉంటారు. అయితే... ఈ ఐరన్ ని ట్యాబ్లెట్స్  రూపంలో మాత్రం తీసుకోకూడదట. ముఖ్యంగా, వైద్యుల సలహా లేకుండా ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు ఎందుకంటే అవి అధికంగా తీసుకుంటే చాలా దుష్ప్రభావాలు ఉండవచ్చు.
 

అధిక మోతాదులో ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవడం, ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, వికారం, కడుపు నొప్పి, వాంతులు , విరేచనాలు అయ్యే అవకాశం ఎక్కువ. ఇది మాత్రమే కాకుండా, పెద్ద మొత్తంలో ఐరన్  అల్సర్లతో సహా ప్రాణాంతక వ్యాధులను తెస్తుంది. వైద్యులు ఎప్పుడైనా మనకు అవసరం అని సూచించినప్పుడు అది కూడా సూచించిన సమయం వరకు మాత్రమేవీటిని వాడాలి. ఆహారంలో తీసుకుంటే ఏ సమస్య ఉండదు.

ఐరన్ లభించే సహజ వనరులు:  ఆకుకూరలు, కాయధాన్యాలు, చిక్‌పీస్, టోఫు,  ఎర్ర మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్, కాలేయం,తృణధాన్యాలు, గింజలు,  విత్తనాలు, క్వినోవా

46
vitamin E

విటమిన్ E
విటమిన్ E మీ శరీరానికి కీలకమైన పోషకం. రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో, కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో , రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే, విటమిన్ E అధికంగా ఉండటం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇది కొన్ని సందర్భాల్లో మరణాలకు దారితీస్తుంది.

విటమిన్ E లభించే సహజ వనరులు: బాదం, పొద్దుతిరుగుడు గింజలు, హాజెల్ నట్స్, కూరగాయల నూనెలు (పొద్దుతిరుగుడు, కుసుమ, గోధుమ బీజ నూనె), అవకాడోలు, పాలకూర, బ్రోకలీ, చిలగడదుంపలు , బలవర్థకమైన తృణధాన్యాలు
 

56

మల్టీవిటమిన్లు
వైద్యుడిని సంప్రదించకుండా ప్రజలు మల్టీవిటమిన్ మాత్రలు వేసుకునే అలవాటు కలిగి ఉంటారు, కానీ ఇది మీ మరణ ప్రమాదాన్ని తెచ్చే అవకాశం ఉంటుందట. మల్టీ విటమిన్లు తీసుకోవడం మంచిదే కానీ... ఎక్కువగా  తీసుకుంటే మాత్రం చాలా పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. అందుకే.. డాక్టర్ల సూచనలు లేకుండా.. వాటిని తీసుకోకూడదు.

66
multivitamin tablet

ప్రతిరోజూ ఏ విటమిన్ ఎంత తీసుకోవాలో తెలుసా?

విటమిన్ A: 900 ఎంసీజీ
విటమిన్ B6: 1.7 మిల్లీగ్రాములు (mg)
విటమిన్ B12: 2.4 mcg
విటమిన్ C: 90 mg
కాల్షియం: 1,300 mcg
క్లోరైడ్: 2,300 mg
అయోడిన్: 150 mg
ఇనుము: 18 mg
మెగ్నీషియం: 420 mg
పొటాషియం: 4,700 mg

సప్లిమెంట్ల అవసరం లేకుండా ఆరోగ్యంగా ఉండేదెలా?

వీలైనంత వరకు మన శరీరానికి అవసరం అయిన విటమిన్లు.. ఆహారం ద్వారా తీసుకునే ప్రయత్నం చేయాలి.పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లతో కూడిన సంపూర్ణ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. చురుకుగా ఉండటానికి , క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నీరు, జ్యూస్ లతో  తగినంత హైడ్రేటెడ్‌గా ఉండండి. శరీరానికి తగినంత విశ్రాంతి, రీఛార్జ్ అవసరం. రోజుకు కనీసం 7 - 9 గంటలు నిద్రపోయే అలవాటును పెంచుకోండి 

click me!

Recommended Stories