
చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఉండే ఫైబర్ , విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. ప్రతిరోజూ చియా సీడ్స్ ని తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు అని నిపుణులు చెబుతుంటారు. దాదాపు అందరూ చియా సీడ్స్ ని నీటిలో నానపెట్టి లేదంటే.. చియా పుడ్డింగ్ రూపంలో లేదంటే.. ఓట్ మీల్ లో కలిపి తీసుకుంటారు. కానీ.. ఈ చిన్న చిన్న గింజలను బీట్ రూట్ జ్యూస్ కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసా? ప్రతిరోజూ ఉదయాన్నే చియా సీడ్స్ కలిపిన బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో... బీట్ రూట్ జ్యూస్ కూడా అంతే మేలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలగనున్నాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ పవర్ హౌస్ లాంటిది. దీనిలో న్యూట్రియంట్స్, విటమిన్లు బి9( ఫోలేట్), విటమిన్ సి తో పాటు.. ఐరన్, పొటాషియం లాంటి మినరల్స్ కూడా ఉంటాయి. రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. బీపీ సమస్యలు రావు. అంతేకాకుండా.. చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవన్నీ.. మనకు ఈ మ్యాజికల్ డ్రింక్స్ తో లభిస్తాయి.
చియా సీడ్స్ లో ఉండే పోషకాలు..
రెండు టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లో 138 క్యాలరీలు, 4.7 గ్రాముల ప్రోటీన్, 8.7 గ్రాముల ఫ్యాట్స్, 12 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది
బీట్ రూట్ లో పోషకాలు..
1కప్పు బీట్ రూట్ లో 58 క్యాలరీలు, 2.2 గ్రాముల ప్రోటీన్, 0.2 గ్రాముల ఫ్యాట్, 13 గ్రాముల కార్బ్స్, 3.8 గ్రాముల ఫైబర్, 9.2 గ్రాముల షుగర్ ఉంటుంది.
ఈ మ్యాజికల్ డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాలు...
1.ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది. గట్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది.
2.బీట్ రూట్ లో నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి.. మన బ్లడ్ ప్రెజర్ పెరగకుండా చూసుకుంటూనే... రక్త ప్రసరణ సరిగా జరిగేలా సహాయం చేస్తుంది. చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్.. శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయం చేస్తుంది.
3. ఈ డ్రింక్ రోజూ ఉదయాన్నే తాగడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా.. ఈ డ్రింక్ తాగి.. సులభంగా బరువు కూడా తగ్గొచ్చు. లివర్ ఫంక్షనింగ్ సరిగా జరగడానికి కూడా సహాయపడుతుంది. మన శరీరంలోని టాక్సిన్స్ మొత్తం బయటకు వెళ్లేలా చేసి... లివర్ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది.
4.ఇవి మాత్రమే కాదు.. నెల రోజులు ఈ జ్యూస్ తాగితే.. మీ స్కిన్ లో గ్లో కచ్చితంగా పెరుగుతుంది. చర్మం మెరిసేలా.. స్మూత్ గా కూడా మారుతుంది. రిజల్ట్ మీకు స్పష్టంగా కనపడుతుంది.