జుట్టు రాలడం ఆగాలంటే..!

First Published | Aug 7, 2023, 3:06 PM IST

జుట్టు ఆరోగ్యానికి కొన్ని రకాల పోషకాలు చాలా అవసరం. ఇవి మీ శరీరంలో లోపిస్తేనే జుట్టు పల్చబడటం, విపరీతంగా రాలడం, వెంట్రుకలు తెగిపోవడం, చుండ్రు వంటి సమస్యలు వస్తాయి. 
 

వర్షాకాలంలో జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. నెత్తిమీద దురద, చుండ్రు, ఒత్తిడి వంటివన్నీ జుట్టు రాలడానికి దారితీస్తాయి. జుట్టు ఊడిపోవడం ఆగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది నూనెను మారిస్తే.. ఇంకొంతమంది షాంపూలను మారుస్తుంటారు. కానీ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు పౌష్టికాహారం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. 
 

జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, జింక్, బి విటమిన్లు, ఐరన్, బయోటిన్, ప్రోటీన్, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలతో సహా సరైన పోషకాలు లేకపోవడం వల్ల జుట్టు విపరీరతంగా రాలుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి జుట్టు రాలడం ఆగడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 


spinach curry

బచ్చలికూర

బచ్చలికూరలో ఇనుము, విటమిన్ ఎ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం  పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూర జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే పోషకాలు మన నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు బాగా పెరిగేందుకు, జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు ఈ కూరగాయ మన వెంట్రుకలు షైనీగా అయ్యేందుకు కూడా సహాయపడుతుంది. 
 

చిక్కుళ్లు

చిక్కుళ్లు జుట్టును బలోపేతం చేయడానికి, పెరగడానికి కూడా సహాయపడతాయి. కాయధాన్యాలు ప్రోటీన్, ఇనుము, జింక్, బయోటిన్ కు అద్భుతమైన మూలం. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి లు ఉంటాయి. 
 

Image: Getty Images

వాల్ నట్స్

వాల్ నట్స్ లో బయోటిన్,  విటమిన్ బి1, విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ ఇ, ప్రోటీన్లు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ వెంట్రుకల మూలాలను బలపరుస్తాయి. అలాగే నెత్తికి మంచి పోషణను అందిస్తాయి.

పెరుగు

పెరుగులో విటమిన్ బి5, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.  పెరుగుతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ లు జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడతాయి. పెరుగులో జుట్టుకు సహజంగా పోషణనిచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

ఓట్స్

ఓట్స్ మన మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఓట్స్లో ఫైబర్స్, జింక్, ఐరన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జుట్టు పెరుగుదలను ప్రేరేపించే పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. 
 

strawberries

స్ట్రాబెర్రీలు

స్ట్రాబెర్రీలలో ఎక్కువ మొత్తంలో సిలికా ఉంటుంది. జుట్టు బలంగా ఉండేందుకు, జుట్టు పెరుగుదలకు సిలికా ఒక ముఖ్యమైన ఖనిజం. వీటిని తింటే మీ బరువు కంట్రోల్ లో ఉండటమే కాదు.. మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
 

Latest Videos

click me!