ఆలుగడ్డలను రోజూ తింటే..!

First Published | Aug 6, 2023, 4:36 PM IST

ఆలుగడ్డలు బరువునే కాదు రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయని కొంతమంది చెబుతుంటారు. 
 

Image: Getty Images

బంగాళాదుంపలను చాలా ఇళ్లలో రెగ్యలర్ గా  తింటుంటారు. అంటే ఏదో ఒక వంటలో వీటిని ఖచ్చితంగా ఉపయోగిస్తుంటారన్న మాట. నిజానికి ఆలుగడ్డలతో వంటను తయారుచేయడం చాలా సులువు. అందులోనూ వీటితో ఎన్నో రకాల వంటలను తయారుచేసి తినొచ్చు. అందులోనూ టమాటా, ఇతర కూరగాయల ధరలు బాగా పెరగడంతో బంగాళాదుంపలను జనాలు ఎక్కువగా కొంటున్నారు. 
 

potato

బంగాళాదుంపలను కూరగా, ఫ్రైగా అంటూ ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. లేదంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బాజీ వంటి వంటకాలను కూడా దీనితో తయారుచేస్తారు. వంటకం ఏదైనా సరే బంగాళాదుంపలను క్రమం తప్పకుండా తినడం అంత మంచిది కాదని వాదించే వారు కూడా ఉన్నారు.


potato

ఒక వాదన ప్రకారం.. బంగాళాదుంపలు మన బరువును పెంచుతాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతాయి. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ కారకాలన్నీ బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తాయని నమ్ముతారు. 

బంగాళాదుంపలను రెగ్యులర్ గా తింటే

బంగాళాదుంపలను క్రమం తప్పకుండా.. అంటే ప్రతిరోజూ తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదు. అయితే కొన్ని విషయాలను మాత్రమే గమనించాలి. మీకు డయాబెటిస్ ఉంటే మీరు ఎంత తింటున్నారు అనే దానిపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్లుగా దీనిలో కార్భోహైడ్రేట్లు, కేలరీలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అదేవిధంగా క్రమం తప్పకుండా ఎక్కువ మొత్తంలో బంగాళాదుంపలు తినడం వల్ల కూడా కొన్నిసార్లు బరువు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
 

బంగాళాదుంపల వల్ల కలిగే ప్రయోజనాలు

బంగాళాదుంపలను మనకు ఎలాంటి హానిని కలిగించవు. కానీ దీనిని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బంగాళాదుంపల్లో ఫైబర్, పొటాషియం, ఇనుము, విటమిన్ సి, విటమిన్ బి 6 లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని వివిధ విధులకు అవసరమైన భాగాలు.

బంగాళాదుంపలు కూడా అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే పొటాషియం కండరాల పనితీరును సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. బంగాళాదుంపలు మన గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

బంగాళాదుంపల వల్ల వచ్చే సమస్యలు

కొన్నిసార్లు బంగాళాదుంపలు మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఒకటి ముందుగా చెప్పినట్టు క్రమం తప్పకుండా.. అంటే ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అందుకే ఎక్కువగా తినకూడదు. దీన్ని ఉడికించి కూరగా తినడం ఆరోగ్యకరమైన పద్ధతి. కానీ దీన్ని నూనెలో వేయించి లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ ను తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. అంతేకాక దానితో పాటు ఇతర కేలరీలు ఎక్కువగా ఉండే వంటకాలు లేదా సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉండే వంటకాలను తినడం మంచిది కాదు.

Latest Videos

click me!