Sunflower Seeds: పొద్దుతిరుగుడు గింజలు రోజూ తింటే ఏమౌతుంది?

Published : Feb 17, 2025, 04:35 PM IST

పొద్దుతిరుగుడు గింజలు మనకు కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. ఇవి తినడం వల్ల శరీరంలో ఎముకలు బలపడటమే కాకుండా, జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. రోజూ తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం...      

PREV
14
Sunflower Seeds: పొద్దుతిరుగుడు గింజలు రోజూ తింటే ఏమౌతుంది?

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారపు అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం. అలాంటి ఒక గింజ ఉంది, దానిని తింటే చాలా పెద్ద వ్యాధులు నయమవుతాయి. మనం రెగ్యులర్ గా సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతూ ఉంటాం. అయితే.. ఆ వంట నూనెను కాస్త పక్కనపెట్టి,  ఈ గింజలను రోజూ గుప్పెడు తినడం మొదలుపెట్టాలి. అలా చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

24

పొద్దు తిరుగుడు గింజల్లో విటమిన్ సి, ఫైబర్, ఇనుము, విటమిన్ ఇ, విటమిన్ బి6, జింక్, రాగి, భాస్వరం, కాల్షియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. మనం ఈ గింజలను రోజూ తినడం వల్ల ఈ పోషకాలన్నీ మనకు లభిస్తాయి. చాలా పోషకాలు ఉన్న ఈ గింజలను మనం  తినడం వల్ల శరీర ఎముకలు బలపడటమే కాకుండా, జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.

34

పొద్దుతిరుగుడు గింజలు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి. ఈ పొద్దుతిరుగుడు గింజల్లో ఉండే మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని కాపాడతాయి.

44
ఎముకలను బలపరుస్తుంది

ఈ పొద్దుతిరుగుడు గింజల్లో మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి, ఇవి ఎముకలను బలపరుస్తాయి. ఎముకలు బలపడి, కీళ్లనొప్పి సమస్యలను కూడా తగ్గిస్తాయి. అంతేకాదు.. ఇమ్యూనిటీ పవర్ పెంచడంలోనూ సహాయపడతాయి.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ పొద్దుతిరుగుడు గింజలను తింటే వారి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఈ గింజల్లో జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి, ఇవి శరీర శక్తిని పెంచుతాయి. మలబద్ధకం, జీర్ణ సమస్యలు ఉన్నవారికి పొద్దుతిరుగుడు గింజలు చాలా మేలు చేస్తాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల.. విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది మన చర్మానికి, జుట్టుకు కూడా మేలు చేస్తుంది.

click me!

Recommended Stories