2.ముల్లంగి పచ్చడి..
మల్లంగిని మనం చాలా రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ, ముల్లంగిని పచ్చడి రూపంలో తీసుకుంటే, చాలా అద్భుతంగా ఉంటుంది. ముల్లంగి ముక్కలు, వేడి ఆవనూనె, మసాలాలు జోడించి చేస్తారు. ఈ పచ్చడి కూడా నోటికి చాలా కమ్మగా ఉంటుంది.
3.మిరప పచ్చడి..
ఈ పచ్చడిని తాజా పచ్చిమిరిపకాయలతో తయారు చేస్తారు. దీనిని అప్పటికప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. వేడి ఆవనూనె, దనియాల పొడి, పసుపు, ఇంగువ, మెంతులు, ఉప్పు, కారం, జీలకర్రతో ఈ పచ్చడిని తయారు చేస్తారు. ఘాటుగా తింటుంటే.. చలికాలం చలిని తిరిమికొట్టిన అనుభూతి కలుగుతుంది.