అంజీరా ఇలా తింటే... ఎన్ని ప్రయోజనాలో తెలుసా.?

First Published Feb 9, 2023, 12:19 PM IST

రాత్రిపూట మూడు లేదా నాలుగు అంజీరాను నానపెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తినాలి. ఆ నీటిని కూడా ఎలాంటి సంకోచం లేకుండా తాగొచ్చు. ఇలా చేయడం వల్ల... శరీరంలో తక్షణ శక్తి లభిస్తుంది.

డ్రై ఫ్రూట్స్ లో అంజీరా పండుకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ అంజీరా పండ్లనే సీమ మేడి పండు అని కూడా పిలుస్తారు. ఈ పండు రూపంలోనే కాదు.. ఎండు రూపాల్లో కూడా లభిస్తుంది

దీనిని ఎలా తిన్నా.. ఇనుము, మెగ్నేషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు, విటమిన్ బి6 అధికంగా శరీరానికి అందుతాయి. వీటితోపాటు దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
 

ఈ అంజీరా పండ్లను రాత్రిపూట నానపెట్టి... ఉదయాన్నే తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట మూడు లేదా నాలుగు అంజీరాను నానపెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తినాలి. ఆ నీటిని కూడా ఎలాంటి సంకోచం లేకుండా తాగొచ్చు. ఇలా చేయడం వల్ల... శరీరంలో తక్షణ శక్తి లభిస్తుంది.

అంజీరాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీనిని ఉదయాన్నే తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండి ఉన్న భావన కలుగుతుంది. ఇది అరగడానికి కూడా ఎక్కువ సమయం తసుకుంటుంది. దీని వల్ల... ఇతర ఆహారాలు తినాలనే కోరిక కలగదు. దీంతో... శరీరానికి అదనంగా ఎలాంటి కేలరీలు అందకుండా ఉంటాయి.

అంజీరాను తినడం వల్ల.... శరీరంలో అరుగుదల సమస్య లేకుండా ఉంటుంది.  అంజీర్ ని డైట్ లో భాగం చేసుకుంటే... ఆరోగ్యపరంగా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
 

అంజీరా ని ప్రతిరోజూ తినడం వల్ల... శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.  అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషదం లా పనిచేస్తుంది. దీనిని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. అంజీరా ఆకులను నీళ్లలో కాచిచల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.
 

ఈ పండ్లలో ఉండే పెప్టిన్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. విటమిన్ బి6 అల్జీమర్స్ రాకుండా కాపాడుతుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. రోజు రెండు లేదా మూడు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. అలా అని అతిగా తింటే.. బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది.

అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నవాళ్లు, రక్తప్రసరణ వ్యవస్థలో తేడా ఉన్నవాళ్లు కూడా అంజీరాను తీసుకుంటే చాలా మంచిది.
 

click me!