ఫ్రూట్ క్రీమ్...
పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ... మనం తీపి తినాలి అనిపించినప్పుడు ఆ స్థానంలో పండ్లను తినలేం. అయితే.. ఆ పండుతో తయారు చేసిన స్వీట్ తినొచ్చు. బరువు సమస్య రాకుండా ఉండాలి అంటే... ఇదిగో ఈ ఫ్రూట్ క్రీమ్ తీసుకుంటే సరిపోతుంది. దీనిని తయారు చేయడం కోసం అరటి, బొప్పాయి, దానిమ్మ, స్ట్రాబెర్రీ వంటి మిక్స్ డ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. దీనితో పాటు... ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పులను కూడా తీసుకోవచ్చు. ఫ్యాట్ లేని క్రీమ్ ని వీటికి జత చేస్తే సరిపోతుంది. క్రీమ్ ని బాగా గిలకొట్టి.. వాటిలో వీటిని కలిపి ఫ్రిడ్జ్ లో కాసేపు ఉంచి తింటే... అద్భుతంగా ఉంటుంది.