ముందుగా అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఎలా తయారు చేయాలో.. ఎలా జాగ్రత్తగా స్టోర్ చేయాలో చూద్దాం..
ముందుగా.. అల్లం , వెల్లుల్లిని విడిగా కడగాలి. తర్వాత వాటిని తొక్కు తీయాలి.
తరువాత, 1 కప్పు తురిమిన , తరిగిన అల్లంతోపాటు 1 కప్పు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. పేస్ట్ చేయడానికి మీరు తాజా వెల్లుల్లి, అల్లం తీసుకోవాలని నిర్ధారించుకోండి.
రెండింటినీ బాగా శుభ్రం చేసిన తర్వాత, వాటిని కిచెన్ టవల్ మీద ఉంచండి, చక్కగా ఆరబెట్టండి. మీరు వాటిని టిష్యూ పేపర్‌పై కూడా పెట్టి ఆరపెట్టొచ్చు.