అర్థరాత్రి భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలు
బరువు పెరుగుట: ప్రతిరోజూ వ్యాయామం, డైటింగ్ చేయపోయినా చాలా మంది బరువు పెరగలేరు. దానికి వారు భోజనం చేసే సమయం మీద ఆధారపడుతుందట. అలా కాకుండా అర్థరాత్రి భోజనం చేసేవారు మాత్రం చాలా తొందగా బరువు పెరిగిపోతారట. చాలా ఆరోగ్య సమస్యలు బరువు పెరగడం నుండి మొదలవుతాయి. కాబట్టి రాత్రి భోజనం ఎప్పుడూ సమయానికి చేయాలి. మీరు బరువు తగ్గాలని ఆరాటపడుతుంటే, ఈరోజు నుండి సకాలంలో రాత్రిపూట భోజనం చేయడం మొదలుపెట్టాలి. సాయంత్రం 6 గంటలకు భోజనం ముగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలా కాదు అంటే కనీసం రాత్రి 8 గంటలకు భోజనం ముగించండి.