పరిగడుపున తినకూడని పండ్లు ఇవి

First Published | Aug 19, 2024, 4:28 PM IST

పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ పరిగడుపున మాత్రం తినకూడదు. అవును కొన్ని పండ్లను పరిగడుపున తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. అసలు ఏయే పండ్లను పరిగడుపున తినకూడదంటే? 
 

సాధారణంగా పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పండ్లను తింటే మన శరీరానికి తక్షణ ఎనర్జీ అందుతుంది. అలాగే శరీరం రీఫ్రెష్ గా అనిపిస్తుంది. కానీ పరిగడుపున పండ్లను తింటే కొంతమందికి జీర్ణ సమస్యలు వస్తాయి. అసలు ఏ పండ్లను పరిగడుపున తినకూడదంటే? 
 

సిట్రస్ పండ్లు

సిట్రస్ పండ్లైన నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష పండ్లు ఎక్కువ ఆమ్లంగా ఉంటాయి. వీటిని పరిగడుపున తింటే గుండెల్లో మంట, చికాకు, గ్యాస్ వంటి సమస్యలు వంటి వస్తాయి. ఇది మీకు గాయాలు ఉన్నట్టైతే అవి మరింత ఎక్కువ అవుతాయి. 
 

Latest Videos


టమాటాలు

టమాటాలను మనం ఎన్నో రకాల కూరల్లో వేస్తుంటాం. రోజూ తింటుంటారు. కానీ టమాటాలను మాత్రం పరిగడుపున తినకూడదు. టమాటాల్లో ఎక్కువ మొత్తంలో టానిక్ ఆమ్లం ఉంటుంది. దీన్ని పరిగడుపున తిన్నప్పుడు కడుపు ఆమ్లత పెరుగుతుంది. ఈ ఆమ్లత్వం చికాకు, అసౌకర్యానికి దారితీస్తుంది.
 

అరటిపండ్లు

అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటిని పరిగడుపున తిన్నప్పుడు మన రక్తంలో మెగ్నీషియం, కాల్షియం సమతుల్యత దెబ్బతింటుంది. ఇది గుండె సమస్యలకు దారితీస్తుంది. అలాగే పైనాపిల్ ను కూడా పరిగడుపున తినకూడదు. దీనిలో బ్రోమెలైన్ కలిగి ఉంటుంది. ఇది కడుపు ఆమ్లతను పెంచుతుంది. 

=

జామకాయ

జామకాయలో ఫైబర్, ఫ్రక్టోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ కాయను పరిగడుపున తింటే మీ జీర్ణవ్యవస్థను మరింత దిగజారుతుంది. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చకాయను పరిగడుపున తింటే కడుపులో ఎసిడిటీ లెవెల్స్ పెరుగుతాయి. 

click me!