శనగలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

First Published | Dec 10, 2023, 1:17 PM IST

శనగలు పోషకాలకు మంచి వనరు. వీటిలో ఐరన్, ఫైబర్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. శనగలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంచుకోవచ్చంటున్నారు నిపుణులు. 

శనగలను ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. మీరు శాకాహారులైతే ఖచ్చితంగా శనగలను తినడానికి ప్రయత్నించండి. శనగల్లో ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం వంటి ఎన్నో రకాల పోషకాలుంటాయి. శనగలను తింటే మనం ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. ఇందుకోసం మీరు వీటిని నానబెట్టి కూడా తినొచ్చు. మరి శనగలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

బరువు తగ్గడానికి..

శనగలను తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ కడుపును తొందరగా నింపుతాయి. దీంతో మీరు బరువు తగ్గుతారు. ఇందుకోసం మీరు వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినొచ్చు. శనగల్లో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిని తింటే మీ కడుపు తొందరగా నిండుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. 

Latest Videos


చర్మానికి మేలు..

శనగల్లో మెగ్నీషియం కూడా బాగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. శనగలను తింటే మన చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే కొల్లాజెన్ కూడా బాగా ఏర్పడుతుంది. దీంతో చర్మ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే ముడతలు కూడా తగ్గిపోతాయి. 

గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి.. 

శనగల్లో ఫైటోన్యూట్రియెంట్స్, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. వీటిని మీ రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. 
 

హిమోగ్లోబిన్ స్థాయి పెంపు.. 

శనగల్లో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతుంది. మీకు రక్తహీనత సమస్య ఉంటే శనగలను తినండి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ శనగలు కొత్తగా తల్లి అయిన వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని నానబెట్టి తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. 
 

ప్రోటీన్, శక్తి సమృద్ధిగా..

మీరు మాంసం తినరా? అయితే శనగలను ఖచ్చితంగా తినండి. ఎందుకంటే ఇవి మీలో ప్రోటీన్ లోపాన్ని పోగొట్టడానికి ఎంతగానో సహాయపడతాయి. శనగలను తింటే ఒంట్లో బలం పెరుగుతుంది. దీంతో మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. 
 

click me!