మామిడి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మామిడి పండ్లలో చాలా న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్స్ ఏ, సీ మరింత ఎక్కువ మొత్తంల ఉంటాయి. ఈ రెండు విటమిన్లు..రోగనిరోధక శక్తిని బలపరచడానికి, కంటి చూపు కోసం.. చర్మం అందంగా కనిపించేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు.. మామిడిలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇది తీసుకున్న ఆహారం మంచిగా అరిగేలా చేయడంలో.. బరువు పెరగకుండా చూడటంలో సహాయం చేస్తుంది. మామిడిలో యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరీటిన్, ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ లాంటి ప్రమాదాలు మన దరి చేరకుండా చేస్తాయి. అంతేనా పొటాషియం, మాంగనీస్్, విటమిన్ కే వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో.. ఎముకలు బలంగా చేయడంలో సహాయపడతాయి.