ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ నెయ్యిని నూనె బదులు వాడొచ్చా..?
మీరు చేసే ప్రతి వంటకు నూనెలకు బదులు నెయ్యిని వాడటం మాత్రం అస్సలు మంచిది కాదు. నెయ్యి పుష్కలంగా ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, దానిని మాత్రమే వాడటం ఆరోగ్యం కాదు. వేరుశెనగ నూనె, ఆలివ్ నూనె , కుసుమ నూనె వంటి నూనెలు అన్నీ ప్రత్యేకమైనవే. నెయ్యిలో లేని పోషకాలు వీటిలో ఉంటాయి. నెయ్యిలో సంతృప్త కొవ్వులు (SFA) ఉంటాయి, కానీ ఇతర నూనెలు సమతుల్య ఆహారం కోసం అవసరమైన మోనోఅన్‌శాచురేటెడ్ (MUFA) పాలీఅన్‌శాచురేటెడ్ (PUFA) కొవ్వులను అందిస్తాయి. కాబట్టి ఇతర నూనెలను కూడా వాడాలి. కానీ, మితంగా తీసుకోవాలి. మీ ఆహారంలో వివిధ రకాల పండ్లు , కూరగాయలను చేర్చుకున్నట్లే, విభిన్న వంట నూనెలను ఉపయోగించడం మంచిది. రెగ్యులర్ గా నూనెలను మారుస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకే రకం నూనెను వాడటం కూడా మంచిది కాదు.