2.పాలకూర జ్యూస్...
ఆకుకూరలు అన్నింటిలోనూ మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికీ, అందాన్ని పెంచడానికి ఉపయోగపడేది ఈ పాలకూర. ఇది మన చర్మానికీ, జుట్టుకీ మ్యాజిక్ లా పని చేస్తుంది. పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది తల చర్మం శుభ్రంగా, పరిశుభ్రంగా , ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడంలో సహాయపడుతుంది. విటమిన్లు బి, సి తల చర్మంలో కెరాటిన్ , కొల్లాజెన్ స్థాయిలను పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. దాని రుచిని పెంచడానికి మీరు పుదీనా ఆకులతో పాటు దోసకాయను కూడా జోడించవచ్చు.