ఈ ఒక్క లడ్డూ తింటే.. మీ జుట్టు పెరుగుతుంది, అందంగా ఉంటారు, మోకాళ్ల నొప్పులూ తగ్గుతాయి

First Published | Oct 10, 2024, 11:01 AM IST

ఆడవాళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉంచే మార్గాలను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. అయితే ఒక లడ్డూను తింటే మాత్రం ఆడవాళ్లు యవ్వనంగా ఉండటమే కాకుండా.. హెల్తీగా కూడా ఉంటారు. ఇంతకీ అదేం లడ్డూ అంటే..

ఒకప్పటి సంగతి పక్కన పెడితే .. ఆడవాళ్లు ఆరోగ్యం, అందం విషయంలో ఎన్నో చిట్కాలను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా సరైన పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. అందాన్ని కూడా పెంచుతాయన్న సంగతి అందరికీ తెలిసింది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఒక లడ్డూ ఆడవాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. ఈ లడ్డూ అందరికీ తెలిసిందే. అదే బెల్లం నువ్వులతో చేసిన నువ్వుల లడ్డూ. ఇది టేస్టీగా ఉండటమే కాకుండా.. శరీరానికి మంచి పోషణను, శక్తిని అందిస్తుంది. 

ఈ నువ్వుల లడ్డూ మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. దీనిలో ఉండే పదార్థాలు మీ జుట్టును, చర్మాన్ని, కళ్లను, జీర్న వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. నువ్వుల్లో ఉండే కాల్షియం, జింక్, గసగసాలల్లో ఉండే ఫైబర్  కంటెంట్, బెల్లంలో ఉండే ఐరన్ అన్నీ కలిసి శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. 

ఈ నువ్వుల లడ్డు మిమ్మల్ని హెల్తీగా ఉంచడమే కాకుండా.. మీ చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తుంది. అందుకే ఈ లడ్డూను ఎలా తయారుచేయాలో తెలుసుకుని దీన్ని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

లడ్డూల తయారీకి కావలసిన పదార్థాలు

నువ్వులు - 5 టీస్పూన్లు
గసగసాలు - 5 టేబుల్ స్పూన్లు
బెల్లం - రుచికి తగినంత

లడ్డు తయారుచేసే విధానం

నువ్వులు, గసగసాలను బాగా పెనం మీద కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత రెండింటిని బెల్లంతో మిక్స్ చేసి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పొడిని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే హెల్తీ, టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డూలు తయారైనట్టే. 
 



రోజూ 1 లడ్డూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు 

జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: నువ్వుల్లో కాల్షియం, జింక్,విటమిన్-ఇ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హెయిర్ ఫాల్ ను చాలా వరకు తగ్గిస్తాయి. ఈ లడ్డూను తింటే మీ జుట్టు బలంగా, హెల్తీగా అవుతుంది. అలాగే జుట్టు పొడుగ్గా పెరుగుతుంది. 

నువ్వుల్లో అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డ్రైగా మారిన జుట్టును మంచి షైనీగా చేస్తాయి. అలాగే ఈ లడ్డూలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును మృదువుగా మారుస్తాయి. నువ్వుల నూనెను జుట్టుకు పెట్టడం వల్ల తేమగా ఉంటుంది. డ్రైనెస్ అనేదే ఉండదు. అంతేకాదు చుండ్రును, దురదను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇకపోతే బెల్లంలో ఐరన్ మెండుగా ఉంటుంది. ఇది రక్త నష్టాన్ని తగ్గించి మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా చేస్తుంది. 

నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు తెల్ల బడకుండా చేస్తాయి. బెల్లం మన శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది జుట్టుకు మంచి మేలు చేస్తుంది. 
 

కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది: 

బెల్లం, నువ్వులు, గసగసాల కలయిక కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ లడ్డూను రోజూ ఒకటి తింటే కళ్లు  ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. గసగసాలలో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిని ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి మీ కంటి చూపును మెరుగుపరచడానికి, కంటిశుక్లం ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. నువ్వుల్లో కంటిని ఆరోగ్యంగా ఉంచే జింక్ కూడా ఉంటుంది. ఇవి రెటీనాను కాపాడి కళ్లను హెల్తీగా ఉంచుతాయి. బెల్లంలో ఐరన్ తో పాటుగా ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. 

మలబద్ధకం నుంచి ఉపశమనం

నువ్వుల్లో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గసగసాల్లో కరగని ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. గసగసాల్లో మాదిరిగానే నువ్వులలో కూడా ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది ప్రేగులను సక్రియం చేసి పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. ఈ లడ్డూను తింటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. 
 

మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి

బెల్లం, నువ్వులు, గసగసాలను కలిపి తీసుకుంటే మోకాళ్ల నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక నువ్వుల లడ్డూను తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నువ్వులు, నువ్వుల నూనెలో యాంటీ ఆర్థరైటిస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

అలాగే నువ్వుల్లో ఎముకలను ఆరోగ్యంగా ఉంచే మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను, మోకాళ్ల నొప్పులను తగ్గించి ఎముకలను బలంగా ఉంచుతాయి. గసగసాల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను,నొప్పిని తగ్గిస్తాయి.

ఇవి మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఈ లడ్డూను తింటే మోకాళ్ల నొప్పి చాలా వరకు తగ్గుతుంది. 

సంతానోత్పత్తి మెరుగుపడుతుంది

నువ్వుల లడ్డూ సంతానోత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. బెల్లం, నువ్వులు, గసగసాల కలయిక సంతానోత్పత్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది.  ఈ లడ్డూను రోజూ ఒకటి తింటే శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. అలాగే మీ శక్తిని పెంచి సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది.

గసగసాలు ఆడవాళ్ల సంతానోత్పత్తిని పెంచుతాయి. ఇవి ఫెలోపియన్ ట్యూబ్ నుంచి శ్లేష్మాన్ని తొలగించి గర్భధారణకు సహాయపడతాయి. అలాగే లైంగిక వాంఛను కూడా పెంచుతాయి. ఈగింజల్లో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది. 

చర్మం అందంగా కనిపిస్తుంది

రోజూ ఒక నువ్వుల లడ్డూను తింటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మూడింటి కాంబినేషన్ మీ చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి కూడా సహాయపడతాయి. గసగసాలలో ఉండే కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. అలాగే చర్మం తేమను నిలుపుకోవడానికి సహాయపడతాయి.

వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.ఇది చర్మాన్ని యవ్వనంగా, కాంతివంగా చేస్తుంది. నువ్వుల్లో ఉండే జింక్  కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని స్ట్రాంగ్ గా, ఫ్లెక్సిబుల్ గా మార్చుతుంది.
 

Latest Videos

click me!