మునగా ఆకులు
మునగాకు మనకు లభించే సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు.ఎందుకంటే.. మునగాకులో మన శరీరానికి అవసరం అయిన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు.. ఈ మునగాకులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. చాలా రకాల వ్యాధులు మన దరి చేకుండా ఆపడమే కాదు.. వృద్ధాప్యం దరి చేరకుండా కాపాడటంలోనూ సహాయం చేస్తుంది.
మునగాకులో క్వెర్సెటిన్, క్లోరోజెనిక్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆకు కూరల్లో ఆక్సీకరణ ఒత్తిడి ఎదుర్కోవడానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ఆకులను డైట్ లో భాగం చేసుకోవడం వల్ల మొత్తం ఆరోగ్యం , దీర్ఘాయువును మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మునగాకుర కూడా పాత్ర పోషిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు మునగాకురను తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మునగాకురలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉండటం వల్ల మెరుగైన ఇన్సులిన్ సెన్సిటివిటీ , గ్లూకోజ్ నియంత్రణకు దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
మునగా ఆకులు
మునగాకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ప్రత్యేకించి 'చెడు' కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. మునగలో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వల్ల కొవ్వు జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన హృదయ ప్రొఫైల్‌కు దోహదం చేస్తుంది" అని డాక్టర్ చౌదరి చెప్పారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులను ఎదుర్కోవడంలో, సరైన ఆరోగ్యాన్ని నిర్వహించడంలో రోగనిరోధక వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. మునగాకురలో విటమిన్ సి , రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి, ఇది బలమైన రోగనిరోధక వ్యవస్థకు దోహదం చేస్తుంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు , వ్యాధుల నుండి శరీరాన్ని మెరుగ్గా రక్షించుకోవచ్చు.
మునగాకురలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి, ఇవి వాపు , సంబంధిత లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శోథ పరిస్థితులను నిర్వహించడంలో సహాయపడుతుంది. హృదయ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి సహజమైన, పోషకమైన మార్గాన్ని అందిస్తుంది. ఇన్ని పోషకాలతో నిండిన మునగాకురను మనం తరచుగా మన ఆహారంలో చేర్చుకోవాలి.
మునగా ఆకులు
మునగాకుల్లో ఇన్ని పోషకాలు ఉన్నాయని తెలిసినా.. వాటిని తీయడం, కోయడం కష్టమని చాలా మందిని.. దానిని వండుకోవడం మానేస్తారు. కానీ.. మునగాకులను సులభంగా తీయడానికి మంచి చిట్కా ఉంది. ముందుగా ఒక ప్లాస్టిక్ బియ్యం సంచిని తీసుకోండి. దానిలో ఒక కట్ట మునగాకుర వేసి గట్టిగా చుట్టండి. ఆ సంచి మీద రెండు బరువైన రోలు రాళ్లను ఉంచండి. రోలు రాళ్లు బరువుగా ఉంటే మంచిది. 2 గంటలు అలాగే ఉంచండి. తర్వాత ఆ మునగాకుర కట్టను బియ్యం సంచిలోనే ఉతికితే, సగం ఆకులు విడిపోతాయి. అంతే.. ఈజీగా మనం మునగాకులను డైట్ లో భాగం చేసుకుంటే సరిపోతుంది.